మోడీ బిగ్ మిస్టేక్..? అమెరికా ఒత్తిడితో అంత పని చేశారా ?
పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ చేపట్టిన భారత్.. దాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్న సమయంలో కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇందులో ఒకటి కాల్పుల విరమణ కాగా మరొకటి ప్రపంచ బ్యాంక్ పాకిస్తాన్ కు ఇచ్చిన 2 బిలియన్ డాలర్ల రుణం. ఈ రెండు పరిణామాల వెనుక ఏముందో తెలుసుకునే లోపే సరిహద్దుల్లో కాల్పుల విరమణ అమల్లోకి వచ్చేయడంతో పాటు భారత్-పాక్ చర్చలు కూడా మొదలైపోయాయి.
అయితే తాజాగా పాకిస్తాన్ కు ప్రకటించిన 2 బిలియన్ డాలర్ల రుణంపై ప్రపంచ బ్యాంక్ పునరాలోచించాలని, ఉగ్రవాదానికి ఆ దేశం ఇస్తున్న మద్దతు నేపథ్యంలో ఇది తప్పనిసరి అని భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తాజాగా కోరారు. దీనిపై ప్రపంచ బ్యాంక్ ఇంకా స్పందించలేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ జైరాం రమేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ బ్యాంక్ పాకిస్తాన్ కు రుణం ఇవ్వకముందే తాము మోడీని దాన్ని అడ్డుకోవాలని అలర్ట్ చేసినట్లు వెల్లడించారు.

పాకిస్తాన్ కు కేటాయిచిన రుణం విడుదల చేయొద్దని ఇప్పుడు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రపంచ బ్యాంక్ ను అడుగుతున్నారని, కానీ తాము ఈ లోన్ పై నిర్ణయం తీసుకోకముందే ప్రధాని మోడీని అలర్ట్ చేసినట్లు కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ తెలిపారు. ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ బోర్డు మే 9న సమావేశమవుతుందని, భారతదేశం దీనిని తీవ్రంగా వ్యతిరేకించాలని కాంగ్రెస్ ఆనాడే చెప్పిందని ఆయన గుర్తుచేశారు. కానీ మోడీ సర్కార్ అమెరికా ఒత్తిడికి తలొగ్గి దీన్ని పట్టించుకోలేదన్నారు.
रक्षा मंत्री राजनाथ सिंह अब 9 मई, 2025 को पाकिस्तान को 2 अरब डॉलर से अधिक का ऋण मंजूर करने के लिए अंतर्राष्ट्रीय मुद्रा कोष (IMF) की आलोचना कर रहे हैं।
— Jairam Ramesh (@Jairam_Ramesh) May 17, 2025
जबकि 29 अप्रैल को ही-मोदी सरकार के जागने से पहले-भारतीय राष्ट्रीय कांग्रेस ने स्पष्ट रूप से कहा था कि IMF की कार्यकारी बोर्ड की… https://t.co/OuQlENp56C
కానీ మే 9న భారత్ ఐఎంఎఫ్ భేటీకి గైర్హాజరు అయిందని, తరువాత మోడీ ప్రభుత్వ డ్రమ్ బీటర్లు, చీర్ లీడర్లు, క్షమాపణ చెప్పే వారు భారతదేశానికి అందుబాటులో ఉన్న ఏకైక ఎంపిక ఇదేనని వాదించారని, కానీ ఇది అబద్ధమని జైరాం రమేశ్ తెలిపారు. ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ బోర్డులో 'నో' అని ఓటు వేయడానికి ఒక నిబంధన ఉందని ఆయన గుర్తుచేశారు. 2016 సెప్టెంబర్‌లో ఉక్రెయిన్‌కు రుణ ప్రతిపాదనపై రష్యా వ్యతిరేకంగా ఓటు వేసిందని, జింబాబ్వే బహిష్కరణ అంశంపై భారతదేశం సెప్టెంబర్ 11, 2005న నో ఓటు వేసిందని జైరాం రమేశ్ గుర్తుచేశారు. సంకల్పం ఉన్నచోట మార్గం ఉంటుందన్నారు.












Click it and Unblock the Notifications