ప్రధాని మోడీ మద్దతుదారులపై ఈసీకి ఫిర్యాదు చేసిన నటి రమ్యా, ఫ్రీ గిఫ్ట్ లు, సోషల్ మీడియా
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ మద్దతుదారులు అంటూ సోషల్ మీడియాలో ఓటర్లను ప్రలోభపెడుతున్నారని, వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా చీఫ్, బహుబాష నటి రమ్యా అలియాస్ దివ్యా స్పందన భారత ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు.
ప్రధాని నరేంద్ర మోడీ మద్దతుదారులు అంటూ ఆయనకు అనుకూలంగా ఉచిత బహుమతులు ఇస్తాం, ఖరీదైన ఫ్రీ గిఫ్ట్ లు ఇస్తాం అంటూ ఫేస్ బుక్, ట్వీట్టర్ తో పాటు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని, ఎన్నికల నియమాలు ఉల్లంఘిస్తున్నారని నటి రమ్య ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు.

బీజేపీకి చెందిన కొందరు నాయకులు ఇలా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఓటర్లను ప్రలోభపెడుతున్నారని, ఎన్నికల నియమాలు తుంగలో తొక్కుతున్నారని నటి రమ్యా ఆరోపించారు. ప్రధాని అనుచరులగా ఇలా ప్రచారం చేస్తున్న సోషల్ మీడియా అకౌంట్లను నటి రమ్యా ఎన్నికల కమిషన్ కు అందించి వారి మీద చర్యలు తీసుకోవాలని మనవి చేశారు.
సమయం చిక్కనప్పుడల్లా ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ నాయకుల మీద విమర్శలు చేసే మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, నటి రమ్యా లోక్ సభ ఎన్నికల సందర్బంగా ఇప్పుడు మళ్లీ తెరమీదకు వచ్చారు. సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ప్రచారం చేస్తున్న నటి రమ్యా పసలేని ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ నాయకులు మండిపడుతున్నారు.
-
మమత vs సువేందు.. దీదీ కంచుకోట బద్దలు..!! -
తమిళనాడు, బెంగాల్ ఎన్నికల వేళ.. కీలక పరిణామం- బీజేపీకి బూస్ట్ -
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
మహేశ్‌కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్‌కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !!












Click it and Unblock the Notifications