వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్‌లో కుమ్ములాటలే.. పాలించడం చేతకాదు: భగవత్ మాన్ హాట్ కామెంట్స్

|
Google Oneindia TeluguNews

ఆప్ సీఎం అభ్యర్థి భగవత్ మాన్ స్వరం పెంచారు. తనను సీఎం క్యాండెట్‌గా ప్రకటించిన తర్వాత.. హాట్ కామెంట్స్ చేశారు. ప్రజలు తనపై విశ్వాసం ఉంచడంతో తన బాధ్యత మరింత పెరిగిందని కామెంట్ చేశారు. పంజాబ్ ఆప్ సీఎం అభ్యర్థిగా భగవత్‌ను కేజ్రీవాల్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

ప్రజల విశ్వాసం

ప్రజల విశ్వాసం

పార్టీపై ప్రజలు విశ్వసిస్తారు అని భగవత్ పేర్కొన్నారు. ఎక్కడికి వెళ్లినా.. తమ పార్టీ అధికారంలోకి వస్తోందని అందరూ అంటున్నారని చెప్పారు. గత పేదళ్ల నుంచి ఆకాళిదల్ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రాష్ట్రాన్ని ఏలాయని పేర్కొన్నారు. అప్పుడు మాఫియా రాజ్ ఉందని చెప్పారు. దీంతో యువత కెనడా, న్యూజిలాండ్ వెళ్లిపోయారని చెప్పారు. కానీ ఇప్పుడు ఆప్ హామీ ఇస్తోందని.. తాము పనిచేస్తామని, ఉపాధి కల్పిస్తామని తెలిపారు. మంచి విద్య, ఆస్పత్రి ఏర్పాటు చేస్తామని వివరించారు.

ప్రతిపక్ష పాత్ర నుంచి..

ప్రతిపక్ష పాత్ర నుంచి..

గత ఎన్నికల సమయంలో ఆప్ ప్రతిపక్ష పాత్ర పోషించిందని తెలిపారు. ఇప్పుడు అధికారం చేపట్టబోతుందని వివరించారు. గత ఎన్నికల సమయంలో అమరీందర్ సింగ్ చాలా హామీలు ఇచ్చారని.. కానీ వాటిని నెరవేర్చలేదని వివరించారు. దీంతో ప్రజలు కాంగ్రెస్ అంటేనే చిదరించుకునే పరిస్థితి ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీలో వారే కొట్టుకుంటున్నారని.. ఆ పార్టీ ఇప్పటికీ సీఎం అభ్యర్థిని ప్రకటించలేదని చెప్పారు. ప్రభుత్వాన్ని సర్కార్ మాదిరిగా నడుపుతారని చెప్పారు. ఇలాంటి వారికి మరో ఐదేళ్లు పాలించే అవకాశం ఇవ్వాలా అని అడిగారు. పసుపు పచ్చ తలపాగా ధరించడానికి గల కారణం వివరించారు. 2014లో భగత్ సింగ్ గ్రామానికి వెళ్లానని.. ఆ సమయంలో ఆ రంగు ధరిస్తానని వాగ్దానం చేశానని తెలిపారు. భగత్ సింగ్ పసుపురంగు వారసత్వంగా ఉండేది.. దానిని మాన్ కొనసాగిస్తున్నారు.

20వ తేదీన పోలింగ్..

20వ తేదీన పోలింగ్..


ఫిబ్రవరి 14న ఉత్తరాఖండ్, గోవాలోని అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించి జనవరి 21న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆ రోజు నుంచి నామినేషన్ ప్రక్రియ మొదలవుతుంది. జనవరి 28తో నామినేషన్లు ముగియనున్నాయి. జనవరి 30 వరకు విత్‌డ్రాకు అవకాశం ఉంటుంది. ఫిబ్రవరి 14న పోలింగ్ జరుగుతోంది. ఫలితాలను మాత్రం మార్చి 10న వెల్లడిస్తారు. పంజాబ్ పోలింగ్ ఫిబ్రవరి 20వ తేదీ ఆదివారం జరగనుంది. తొలుత 14వ తేదీ నిర్వహిస్తామని షెడ్యూల్‌లో ఈసీ తెలిపింది. మిగతా పక్షాల నుంచి కూడా వ్యతిరేకత వచ్చింది. దీంతో 20వ తేదీన నిర్వహిస్తామని ఈసీ తెలిపింది.

English summary
Aam Aadmi Party’s chief ministerial candidate for Punjab Bhagwant Mann said that his sense of responsibility and motivation had doubled after the people put their faith in him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X