వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే అవుట్: రేపే బీజేపీలో చేరిక: మునుగోడుతో పాటు ఆ స్థానానికీ బైపోల్

|
Google Oneindia TeluguNews

చండీగఢ్: కాంగ్రెస్ పార్టీలో రాజీనామాల పర్వం కొనసాగుతోన్నట్టు కనిపిస్తోంది. పార్టీ హైకమాండ్‌, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వ్యవహారాలపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వస్తోన్న నాయకులు రాజీనామాల బాట పడుతున్నారు. పార్టీని వీడుతున్నారు. ప్రత్యామ్నాయ దారులను వెదుక్కుంటోన్నారు. ఇందులో భాగంగా భారతీయ జనతా పార్టీ వైపే చూపులు సారిస్తోన్నారు. ఈ రాజీనామాలు, వలసలను నివారించడంలో అటు పార్టీ అధిష్ఠానం గానీ, ఇటు పీసీసీ అగ్ర నాయకత్వం గానీ విఫలమౌతోంది.

వైసీపీ సహా ఆ పార్టీలకు సుప్రీం షాక్: సీజేఐ ఎన్వీ రమణ బెంచ్ కీలక సూచనలు: డెడ్‌లైన్వైసీపీ సహా ఆ పార్టీలకు సుప్రీం షాక్: సీజేఐ ఎన్వీ రమణ బెంచ్ కీలక సూచనలు: డెడ్‌లైన్

తెలంగాణలో..

తెలంగాణలో..

తెలంగాణలో బలమైన సామాజిక వర్గానికి చెందిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. సుదీర్ఘకాలంగా పార్టీతో కొనసాగుతూ వస్తోన్న అనుబంధాన్ని తెంచుకున్నారు. ప్రత్యామ్నాయంగా ఆయన బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నాయి. త్వరలోనే ఆయన హస్తినకు బయలుదేరి వెళ్తారని, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేతుల మీదుగా లాంఛనంగా కాషాయ కండువాను కప్పుకోవడం దాదాపుగా ఖాయమైంది.

2009లో ఎంపీగా..

2009లో ఎంపీగా..

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సుదీర్ఘకాలం కాంగ్రెస్‌లో పని చేస్తూ వస్తోన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమక్షంలో రాజకీయాల్లో ప్రవేశించారు. 2009 నాటి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా భువనగిరి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి, లక్షా 40 వేల ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. అప్పటి నుంచీ కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా ఉంటోన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు నియోజకవర్గం నుంచి గెలుపొందారు.

 ఉప ఎన్నిక టికెట్..

ఉప ఎన్నిక టికెట్..

కొంతకాలంగా ఆయన అసంతృప్తితో ఉంటోన్నారని, పార్టీ ఫిరాయించే అవకాశాలు లేకపోలేదంటూ వార్తలొచ్చాయి. వాటిని నిజం చేసేలా ఆయన కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పారు. ఇటీవలే ఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలిసిన అనంతరం వచ్చిన ప్రచారాన్ని నిజం చేసినట్టయింది. బీజేపీలో చేరడం లాంఛనప్రాయమే. మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నికలో ఆయన బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాలు లేకపోలేదు.

హర్యానాలో..

హర్యానాలో..

హర్యానాలో ఇదే పరిస్థితి ఏర్పడింది. సీనియర్ శాసన సభ్యుడు కుల్‌దీప్ బిష్ణోయ్.. తన పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీ శాసన సభ సభ్యత్వానికీ గుడ్‌బై చెప్పారు. ఈ మధ్యాహ్నం ఆయన స్పీకర్ జ్ఞాన్ చంద్ గుప్తాను కలిసి తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. గురువారం ఆయన బీజేపీలో చేరే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇక ఎక్కువ కాలం మనుగడ సాగించబోదని కుల్‌దీప్ బిష్ణోయ్ వ్యాఖ్యానించారు.

 నాలుగు సార్లు ఎమ్మెల్యే..

నాలుగు సార్లు ఎమ్మెల్యే..

కుల్‌దీప్ బిష్ణోయ్.. నాలుగు సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. మరో రెండుసార్లు లోక్‌సభకు ప్రాతినిథ్యాన్ని వహించారు. 2019 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన హిసార్ జిల్లాలోని ఆదంపూర్ నియోజకవర్గం నుంచి 29 వేలకు పైగా ఓట్ల తేడాతో బీజేపీకి చెందిన సొనాలి ఫొగట్‌ను ఓడించారు. ఆయన రాజీనామావల్ల ఆదంపూర్ స్థానానికి ఉప ఎన్నిక ఖాయమైంది. రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారనే కారణంతో హర్యానా కాంగ్రెస్ ఆయనపై సస్పెన్షన్ వేటు వేసిం

English summary
Congress MLA Kuldeep Bishnoi resigns, is expected to join the BJP on August 4.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X