రిటైర్‌మెంట్ తరువాత వెంకయ్య నాయుడి భవిష్యత్ ఎలా ఉండబోతోందో తేల్చేసిన కాంగ్రెస్ ఎంపీ

న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమి.. కొన్ని అనూహ్య పరిణామాల మధ్య ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగ్‌దీప్ ధన్‌కర్ పేరును ప్రతిపాదించింది. తమ తరఫున ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఆయన పేరును ఖరారు చేసింది. దీనితో అప్పటివరకూ ప్రచారంలో ఉన్న కేంద్ర మాజీమంత్రి ముఖ్తార్ అబ్బాస్ నక్వీ, కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ పేర్లు తెరమరుగయ్యాయి.

ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పదవీకాలం ఆగస్టు 10వ తేదీన ముగియనుంది. ఆయన స్థానాన్ని భర్తీ చేయడానికి కేంద్ర ఎన్నికల కమిషన్ అదే నెల 6వ తేదీన పోలింగ్‌ను నిర్వహించనుంది. దీనికి ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. ఎన్డీఏ నుంచి జగ్‌దీప్ ధన్‌కర్ అభ్యర్థిత్వం ఖరారు కాగా.. ప్రతిపక్ష యూపీఏ సంకీర్ణ కూటమి తమ అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. ఒకట్రెండు రోజుల్లో ఉప రాష్ట్రపతి అభ్యర్థి పేరు తెరమీదకి వచ్చే అవకాశాలు లేకపోలేదు.

వెంకయ్య నాయుడు పదవీకాలం ముగియబోతోన్నందున కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు జైరామ్ రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ మంచి మనిషి వెళ్లిపోతున్నారు.. అంటూ కామెంట్స్ చేశారు. రాజ్యసభ ఛైర్మన్‌గా ఆయన అందించిన సేవలను విస్మరించలేమని చెప్పారు. ఛైర్మన్‌గా సభను తనదైన శైలిలో సజావుగా నిర్వహించారని పేర్కొన్నారు. ఆయన చతురోక్తులను మిస్ అవుతున్నామని చెప్పారు.

Congress MP Jairam Rameshs parting message for the outgoing VP Venkaiah Naidu

ఎన్డీఏ ప్రవేశపెట్టిన పలు అంశాలను వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష సభ్యులు ఎన్నోసార్లు ఆందోళనలు కొనసాగించారని జైరామ్ రమేష్ గుర్తు చేశారు. అయినప్పటికీ- వెంకయ్యనాయుడు అంటే తమకందరికీ గౌరవం ఉందని పేర్కొన్నారు. ఇప్పుడాయన పదవీ విరమణ చేయొచ్చేమో గానీ.. ఎప్పటికీ విశ్రమించబోరని, ఈ విషయం తనకు తెలుసని చెప్పారు. జైరామ్ రమేష్‌తో పాటు ప్రతిపక్ష పార్టీలకు చెందిన మరికొందరు ఎంపీలు వెంకయ్య నాయుడిని అభినందిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+