EY News: EY ఉద్యోగి కుటుంబాన్ని పరామర్శించిన శశిథరూర్.. కంపెనీల్లో వర్క్ కల్చర్‌పై ఫైర్
Shashi Tharoor: గతకొంత కాలంగా దేశంలో పనిగంటలపై వివాదం నెలకొంది. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో తీవ్ర దుమారం రేపాయి. కేవలం సామాన్యులే కాకుండా దిగ్గజ పారిశ్రామికవేత్తలు సైతం పనిగంటల పెంపునకు సంబంధించి రెండు వర్గాలుగా చీలిపోయి మరీ తమ అభిప్రాయాలను తెలియజేశారు. అయితే ఇటీవల ఓ టెక్ కంపెనీలో జరిగిన ఉదంతం మరోసారి ఈ చర్చను లేవనెత్తింది.
ఎర్నెస్ట్ & యంగ్ (EY)లో పని చేస్తూ ఇటీవల మరణించిన 26 ఏళ్ల చార్టర్డ్ అకౌంటెంట్ తల్లిదండ్రులను తిరువనంతపురం MP శశి థరూర్ కలిశారు. జూలైలో అన్నా సెబాస్టియన్ పెరయిల్ గుండెపోటుతో మరణించాడు. దీనికి కారణం కంపెనీలో అధిక పని మరియు ఒత్తిడే కారణమనే ఆరోపణలు ఉన్నాయి. EY ఇండియా హెడ్ రాజీవ్ మీమణికి రాసిన లేఖలో 4 అతిపెద్ద కన్సల్టింగ్ & అకౌంటింగ్ కంపెనీల్లో అధిక పని విధానాన్ని అన్నా తల్లి అనితా అగస్టిన్ విమర్శించారు. కాగా MP వారిని కలిసి పరామర్శించారు.

'కంపెనీలు తమ ఉద్యోగులను రోజుకు 16 గంటలు పని చేయాలని కోరితే, ఉద్యోగుల హక్కులను దుర్వినియోగం చేసినట్లే. సిబ్బంది శ్రమను దోపిడీ చేయడానికి బదులుగా ఎక్కువ మందిని నియమించుకోవాలి' అని థరూర్ పోస్ట్ చేశారు. గతవారం ఇదే విషయంపై సెబాస్టియన్ తండ్రితో ఆయన మాట్లాడారు. బాధితుడు EYలో ఒత్తిడితో కూడిన రోజులను అనుభవించాడని, రోజుకు 14 గంటలు చొప్పున వారానికి 7 రోజులు పని చేశాడని హైలైట్ చేశారు. ప్రైవేట్ లేదా ప్రభుత్వ రంగంలో అన్ని ఉద్యోగాలకు రోజుకు 8 గంటలు మరియు వారానికి 5 రోజులు నిర్ణీత పని సమయం ఉండేలా చట్టం అవసరమని భావిస్తున్నట్లు చెప్పారు.
బాధితుడి అంత్యక్రియలకు EY నుంచి ఎవరూ హాజరు కాకపోవడం పట్ల రాజీవ్ మీమణి విచారం వ్యక్తం చేశారు. సామరస్యపూర్వకమైన కార్యాలయాన్ని సృష్టించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా అన్నా సెబాస్టియన్ మరణానికి కారణమైన పూణేలోని EY పరిస్థితులపై దర్యాప్తు చేస్తామని కేంద్రం ప్రకటించింది. రానున్న రోజుల్లో ఈ తరహా ఘటనలకు అడ్డుకట్టవేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపింది.












Click it and Unblock the Notifications