అర్దరాత్రి జూమ్ మీటింగ్ పెట్టుకున్న కాంగ్రెస్ హైకమాండ్, ఆ భయం పట్టుకుంది !

బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటకలోలో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ తరువాత ఆపరేషన్ కమలకు తెర లేస్తుందని పసిగట్టిన కర్ణాటక కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ చార్జ్, ఆ పార్టీ సీనియర్ నాయకుడు రణదీప్ సింగ్ సూర్జేవాల బెంగళూరు చేరుకుని కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు.

ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వచ్చినా బీజేపీ నాయకుల మాటలతో హడలిపోయిన కాంగ్రెస్ పార్టీ లీడర్స్ ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గురువారం అర్దరాత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రణదీప్ సింగ్ సూర్జేవాలా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన 223 మంది అభ్యర్థులతో జూమ్ మీటింగ్ లో మాట్లాడారని వెలుగు చూసింది.

Congress party high command talking in zoom meeting with party leaders

మేలుకోటేలోని ఒక్క నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ స్వతంత్ర పార్టీకి అభ్యర్థికి మద్దతు ప్రకటించడంతో అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోటీ చెయ్యలేదు. జూమ్ మీటింగ్ లో 223 మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులతో రణదీప్ సింగ్ సూర్జేవాలా, కేపీసీసీ అధ్యక్షుడు డీకే. శివకుమార్, మాజీ సీఎం సిద్దరామయ్య కూడా మాట్లాడారని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు.

బీజేపీ నాయకులు మిమ్మల్ని సంప్రదిస్తే ఎలాంటి సమాధానం చెప్పాలి, వారి ప్రలోభాలకు ఎంత దూరంగా ఉండాలి అని రణదీప్ సింగ్ సూర్జేవాలా కాంగ్రెస్ పార్టీ నాయకులకు సూచించారని తెలిసింది. కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని, ఆవేశంతో ఆపరేషన్ కమల ప్రలోభాలకు లొంగకూడదని కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, సిద్దరామయ్య కాంగ్రెస్ పార్టీ నాయకులకు ధైర్యం చెప్పారని వెలుగు చూసింది.

బీజేపీ నాయకులు పదేపదే ఆపరేషన్ కమలా అంటూ, ప్లాన్ బి అంటూ బహిరంగంగా చెప్పడంతో కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో వనుకు మొదలైయ్యిందని తెలిసింది. కర్ణాటకలోని అన్ని అసెంబ్లీ నియోజక వర్గాల్లో పోటీ చేసిన అభ్యర్థులతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు టచ్ లోనే ఉన్నారని తెలిసింది. కొన్ని సర్వేలు ఇంచుమించు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు 100 సీట్లు వస్తాయని చెప్పడంతో అప్పుడే కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఆపరేషన్ కమల కలవరం పట్టుకుందని తెలిసింది.

కౌంటింగ్ పూర్తి అయిన తరువాత అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరిని బెంగళూరు వచ్చేయాలని రణదీప్ సింగ్ సూర్జేవాలా, డీకే శివకుమార్, సిద్దరామయ్య సూచించారని తెలిసింది. ముందు జాగ్రత్తగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల విషయంలో ఇప్పటి నుంచి అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నది.

Congress party high command talking in zoom meeting with party leaders

ఇప్పటికే మా దగ్గర ప్లాన్ బి ఉందని బీజేపీ బాంబు పేల్చింది. ఇంకో పక్క ఆపరేషన్ కమలా విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళన చెందుతున్నారు. కాంగ్రెస్. బీజేపీ నాయకులు ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటున్నారు. అయితే జేడీఎస్ మాత్రం మేమే కింగ్ మేకర్ అనే ధీమా ధైర్యంగా ఉందని తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+