కోడలి చేతిలో ఓడిపోతా: ముందే చెప్పిన కాంగ్రెస్ అభ్యర్థి

దేశవ్యాప్తంగా లోకసభ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నెల 16న ఫలితాలు రానున్నాయి. ఫలితాలకు ముందే విక్రమ్ మాదమ్ తన ఓడిపోతానని చెప్పడం గమనార్హం. తాను తన ప్రత్యర్థి బిజెపి అభ్యర్థి పూనమ్ మాదమ్ చేతిలో భారీ ఓట్లతో ఓడిపోతానని ప్రకటించారు.
రెండుసార్లు ఎంపీగా గెలుపొందిన విక్రమ్ మాదమ్ పైన బిజెపి తరఫున ఆయన మేనకోడలే పోటీ చేశారు. ఏడో విడత ఎన్నికల్లో భాగంగా బుధవారం గుజరాత్‌లోని జామ్ నగర్ లోకసభ స్థానానికి పోలింగ్ జరిగింది.
మోడీకి అహ్మదాబాద్ పోలీసులు క్లీన్ చిట్
భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి శుక్రవారం అహ్మదాబాద్ పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చారు. మోడీ ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం పార్టీ గుర్తు చూపిస్తూ నిషేధిత ప్రాంతంలో ప్రసంగిచారని వచ్చిన వార్తలపై పోలీసులు స్పందించారు. పోలింగ్ కేంద్రానికి వంద మీటర్ల అవలే ఆయన ప్రసంగించారని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అన్ని కేసులు లాగా దీనిని కూడా దర్యాప్తు చేశామని తెలిపారు. పోలింగ్ కేంద్రం చుట్టూ అధికారులు తెల్లని హద్దులు వేశారని, దాని బైటే మోడీ ప్రసంగించారన్నారు.












Click it and Unblock the Notifications