అహ్మద్ పటేల్‌కు కరోనా పాజిటివ్, ఐసోలేషన్‌లో ఉండాలని ట్వీట్..

కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీకి నమ్మిన బంటు, సీనియర్ కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్‌కు కరోనా వైరస్ సోకింది. తనకు పాజిటివ్ నిర్దారణ అయ్యిందని ఆయన ట్వీట్ చేశారు. ఇటీవల తనను కలిసిన వారు హోం ఐసోలేషన్‌లో ఉండాలని కోరారు. ఆయన కూడా ఇంటి వద్ద ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు.

అహ్మద్ పటేల్ వయస్సు 70కి పైగా ఉంటాయి. అయితే వృద్దులకు వైరస్ సోకొద్దని.. తగ్గడం కష్టమని వైద్యులు చెబుతున్నారు. అయితే చాలా మంది వృద్దులు వైరస్‌ను జయించిన సంగతి తెలిసిందే. దేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. అయితే రికవరీ సంఖ్య కూడా పెరుగుతోంది. రికవరీ రేటు 83.53 శాతం ఉందని వైద్యాధికారులు వెల్లడించారు. మార్చి 25వ తేదీన లాక్ డౌన్ విధించినప్పటీ నుంచి రికవరీ రేటు మెరుగుపడుతుండటం విశేషం.

congress senior leader ahmed patel infect covid-19

మరోవైపు వ్యాక్సిన్ ప్రయోగ దశ చివరికీ వచ్చింది. ఈ ఏడాది చివరీ వరకు వచ్చే అవకాశం ఉంది. అమెరికాలో మాత్రం ఏప్రిల్ నాటికి ప్రతీ ఒక్కరికీ వ్యాక్సిన్ ఇస్తామని ట్రంప్ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+