సోనియాగాంధీకి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను శిమ్లాలోని ఇందిరాగాంధీ మెడికల్ కాలేజ్ & హాస్పిటల్ (IGMC) లో చేర్చారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో సోనియాకు చికిత్స అందిస్తుండగా.. ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.
కాగా ఈ మధ్య కాలంలో రాజకీయ కార్యక్రమాలలో పాల్గొనడంతో పాటు, ఆరోగ్య పరంగా కొంత అలసటకు లోనయ్యారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలో ఆమె రొటీన్ మెడికల్ చెకప్ కోసం శిమ్లాలోని IGMCలో చేరినట్టు పేర్కొంటున్నారు. వైద్యులు సోనియాకు ఎంఆర్ఐ స్కానింగ్ సహా పలు రకాల పరీక్షలు నిర్వహించినట్లు సమాచారం.

ఈ విషయాన్ని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు మీడియా ప్రధాన సలహాదారు నరేష్ చౌహాన్ నిర్ధారించారు. సోనియా గాంధీ ఆరోగ్యం పూర్తిగా నిలకడగా ఉందని.. ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని వివరించారు.
ఇక సోనియా ఆసుపత్రిలో చేరడంతో.. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా కుటుంబ సభ్యులు దగ్గరుండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతానికి ఆమెను ఢిల్లీకి లేదా ఇతర ప్రముఖ హాస్పిటల్స్‌కు తరలించే అవసరం లేదని వైద్యులు స్పష్టం చేశారు. చివరిసారిగా మే 27న దివంగత ప్రధాని జవహర్‌లా నెహ్రూ 61వ వర్దంతి సందర్భంగా కనిపించారు. ఈ క్రమంలోనే ఆమె త్వరగా కోలుకోవాలని కాంగ్రెస్ నేతలు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.












Click it and Unblock the Notifications