మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ సమర భేరీ - నేడు మెహంగాయ్ పర్ హల్లా బోల్ ర్యాలీ..!!
కేంద్రంలోని మోదీ ప్రభుత్వ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ భారీ ర్యాలీకి సిద్దమైంది. పెరిగిన ధరలు..ద్రవ్యోల్బణం నిరసిస్తూ కాంగ్రెస్ ఈ ర్యాలీకి నిర్ణయించింది. అందులో భాగంగా.. ఢిల్లీలోని రాం లీలా మైదాన్ లో భారీ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. "మెహంగాయ్ పర్ హల్లా బోల్" నినాదంతో నిరసనలు కాంగ్రెస్ నిరసనలకు పిలుపునిచ్చింది. కాంగ్రెస్ నేతలు ఏఐసిసి ప్రధాన కార్యాలయం నుంచి బస్సులలో బయల్దేరి రాంలీలా మైదాన్"కు చేరుకోనున్నారు.

కాంగ్రెస్ నేతలంతా కలిసి కట్టుగా
అందులో ఏఐసిసి జనరల్ సెక్రటరీలు, సెక్రటరీలు, పిసిసి అధ్యక్షులు, సి.ఎల్.పి నాయకులు, పిసిసి మాజీ అధ్యక్షులు, ఎమ్.పిలు, పార్టీ అగ్రనేతలు పాల్గొననున్నారు. ఈ ర్యాలీని ఉద్దేశించి పార్టీ ముఖ్య నేత రాహుల్ గాంధీ ప్రసంగిస్తారు. ఆగస్టు 17 నుంచి 23 వరకు వరుసగా దేశంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ "మెహంగాయ్ చౌపాల్" నిరసన ప్రదర్శనలు నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ...వీటికి ముగింపుగా నేడు ఢిల్లీలో ఈ నిరసన ర్యాలీకి నిర్ణయించింది.
దేశంలో అంతకంతకూ పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు వ్యతిరేకంగా ఈ నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నట్లు పార్టీ నేతలు ప్రకటించారు. ఈ ర్యాలీ కోసం భారీగా కాంగ్రెస్ కార్యకర్తలు తరలి వస్తున్నట్లు పార్టీ నేతలు వెల్లడించారు.

కేంద్రం దిగి వచ్చే వరకూ పోరాటం
కేంద్ర ప్రభుత్వం నిత్యావసర ధరలు తగ్గించే వరకూ ప్రజల తరపున పోరాటాలు కొనసాగిస్తామని ప్రకటించారు. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూలదోసే పనిలో చాలా బిజీగా ఉందని..సామాన్యుల కష్టాలను పట్టించుకోవటం లేదని కాంగ్రెస్ విమర్శిస్తోంది.
పెరిగిన ధరలకు వ్యతిరేకంగా, గత ఆగస్టు నెలలో వీధుల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అరెస్ట్ అయిన విషయాన్ని పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఈ నెల 7 నుంచికన్యాకుమారి నుంచి రాహుల్ గాంధీ నిర్వహించబోతున్న సుమారు 3500 కిలోమీటర్ల దూరం గల "భారత్ జోడో" యాత్ర కు ముందస్తుగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఈ ర్యాలీ నిర్వహిస్తోంది.

రాహుల్ పాదయాత్రకు ముందుగా ర్యాలీ
గులాం నబీ ఆజాద్ రాజీనామా.. మరి కొందరు నేతలు ఆయన్ను అనుసరిస్తున్న వేళ.. కాంగ్రెస్ ఈ ర్యాలీ ద్వారా పార్టీ బలం చాటేందుకు ప్రయత్నిస్తోంది. మరి కొద్ది నెలల్లో గుజరాత్ తో పాటుగా హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో..కాంగ్రెస్ పార్టీ కేంద్రానికి వ్యతిరేకంగా నిర్వహిస్తున్న ఈ ర్యాలీని సక్సెస్ చేయాలని.. ప్రజల వాయిస్ బలంగా వినిపించాలని నిర్ణయించింది. రాహుల్ పాదయాత్ర ముందు ఈ సభ పైన ఆసక్తి కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications