యడియూరప్ప కొడుకును ఢీకొట్టే సత్తా ఉందా?, సిద్దూ ఇంటి ముందు సొంత పార్టీ ధర్నాతో షాక్ !

బెంగళూరు/శివమొగ్గ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్ దక్కించుకోవాలి అంతే, గెలుస్తామో, ఓడిపోతామో అనే విషయం వేరే అని కొందరు నాయకులు అనుకుంటున్నారు. ఎమ్మెల్యే టిక్కెట్లు సంపాధించుకోవడానికి అయితే ప్లాన్-ఏ, కాకపోతే ప్లాన్ -బి, టిక్కెట్ వస్తే రాని, రాకపోతే పోని అంటూ అని పలు పార్టీల్లోని కొందరు నాయకులు తెగించేశారు.

మాజీ సీఎం బీఎస్. యడియూరప్ప కుమారుడు బీవై. విజయేంద్రను ఓడించడానికి శికారిపురలో సరైన అభ్యర్థిని నిలబెట్టాలని, అప్పుడు యడియూరప్ప కుమారుడు ఓడిపోతాడని డిమాండ్ చేస్తే శికారిపుర నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బెంగళూరులోని సిద్దరామయ్య అధికారిక నివాసం ముందు ధర్నా నిర్వహించారు.

Siddaramaiahs house

గతంలో కాంగ్రెస్, బీజేపీ లోలోపల ఒప్పందం చేసుకుని శికారీపురలో బీఎస్. యడియూరప్ప మీద సరైన అభ్యర్థిని పోటీకి దింపలేదని, అందుకే యడియూరప్ప ఆ ప్రాంతంలో తిరుగులేని నాయకుడు అయ్యారని శికారీపుర కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. గతంలో యడియూరప్ప మీద పోటీ చేసిన గోణి మహంతేష్ కు టిక్కెట్ ఇవ్వకూడదని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు డిమాండ్ చేశారు.

Siddaramaiahs house

శికారీపురలో ఈసారి విజయేంద్ర మీద పోటీ చెయ్యడానికి నాగరాజ్ కు టిక్కెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. శివారీపురలో ఇప్పటి వరకు బీఎస్ యడియూరప్ప 8 సార్లు ఎమ్మెల్యే అయ్యి నాలుగుసార్లు సీఎం అయ్యారు. శికారిపురలో యడియూరప్ప హవా ఎలా ఉంటుందంటే ఆయన గతంలో బీజేపీని వదిలేసి కేజీపీ పార్టీ స్థాపించి శికారిపురలో 24,425 ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యే అయ్యారు. అప్పుడు శికారీపురలో బీజేపీ అభ్యర్థికి కేవలం 2, 383 ఓట్లు మాత్రమే రావడంతో డిపాజిట్ కూడా దక్కలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+