గస్తీ పోలీసును కాల్చి చంపిన ఉగ్రవాదులు ?
మిడ్నాపూర్: పశ్చిమ బెంగాల్ లో దారుణం చోటు చేసుకునింది. గురువారం రాత్రి గస్తీ తిరుగుతున్న ఓ పోలీసును గుర్తు తెలియని దుండగులు తుపాకితో కాల్చి చంపి చాకచక్యంగా తప్పించుకున్న ఘటన పశ్చిమ బెంగాల్ లో జరిగింది.
పశ్చిమ బెంగాల్ లోని మిడ్నాపూర్ జిల్లాలోని మహిషాదల్ పోలీస్ స్టేషన్ లో నబకుమార్ కానిస్టేబుల్ గా ఉద్యోగం చేస్తున్నారు. గురువారం రాత్రి నబకుమార్ సాటి పోలీసులతో కలిసి గస్తి తిరుగుతున్నారు.
అదే సమయంలో జాతీయ రహదారి 41 దగ్గర ఇద్దురు దుండగులు అనుమానాస్పదంగా అటు వైపు సంచరించారు. నబకుమార్ వారిని గుర్తించి దగ్గరకు వెళ్లి ప్రశ్నించారు. ఎవరు మీరు ఇక్కడ ఎందుకు తిరుగుతున్నారు అని అడిగారు.

బ్యాగులు తీసి చూపించాలని చెప్పాడు. అంతే మాట మాట పెరిగింది. సహనం కొల్పోయిన ఓ దుండగుడు బ్యాగులో నుంచి బాంబులు, తుపాకి బయటకు తీశాడు. తరువాత తుపాకితో నబకుమార్ మీద కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారైనారు. సాటి పోలీసులు తేరుకుని ఏమి జరిగింది అంటూ పరుగు తీశారు.
రక్తపుమడుగులో పడి ఉన్న నబకుమార్ ను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే నబకుమార్ మరణించాడని వైద్యులు చెప్పారు. విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు వివరాలు తెలుసుకున్నారు. దుండగుల కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications