Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

12వ తరగతి పాఠ్యపుస్తకాల నుంచి మొఘలుల చరిత్ర తొలగింపు.. NCERT వివరణ ఇదే..!

ఢిల్లీ: మొఘలుల చరిత్రను 12వ తరగతి పాఠ్య పుస్తకాల నుంచి తొలగించేందుకు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT)నిర్ణయం తీసుకుందంటూ వార్తలు రావడంతో వివాదం చెలరేగింది. దీంతో విద్యాశాఖ రంగంలోకి దిగి దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఎన్‌సీఈఆర్‌టీ డైరెక్టర్ దినేష్ ప్రసాద్ సక్లానీ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. మొఘులుల చరిత్రపై పాఠాలను తొలగించడం లేదని చెప్పుకొచ్చారు. గతేడాది కరోనావల్ల చాలా వరకు పాఠాలను విద్యార్థులకు బోధించేందుకు వీలుపడలేదని చెప్పిన ఆయన ఈ క్రమంలోనే కొన్ని పాఠ్యాంశాలను తగ్గించి పిల్లల మీద ఒత్తిడి లేకుండా చేయాలని భావించినట్లు చెప్పారు.

మొఘలుల చరిత్రను తొలగిస్తామనే నిర్ణయం జరిగిపోయిందనే ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని చెప్పారు.ఈ పాఠం తొలగించడం వల్ల విద్యార్థుల్లో ఉన్న విషయ జ్ఞానం లేదా లోకజ్ఞానం ఏమి తగ్గిపోదని వారిపై మాత్రం ఉన్న ఒత్తిడి భారం మాత్రమే తగ్గుతుందని నిపుణులు సూచించినట్లు దినేష్ ప్రసాద్ సక్లానీ పేర్కొన్నారు.ఇక దీనిపై చర్చ అనవసరం అని చెప్పిన ఆయన ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే పాఠ్యపుస్తకాలను పరిశీలించాలని కోరారు.

NCERT

తాము జాతీయ విద్యా విధానం 2020ని అనుసరించే పనిచేస్తున్నట్లు దినేష్ చెప్పారు. ప్రస్తుతం రూపాంతరం చెందే దశలో ఉన్నట్లు చెప్పిన ఆయన... జాతీయ విద్యా విధానం విద్యార్థులపై భారం తగ్గించేలా డిజైన్ చేసినట్లు గుర్తు చేశారు. దాన్నే ఇప్పుడు అమలు చేస్తున్నామని చెప్పారు. పాఠశాల విద్య కోసం నేషనల్ కరుక్యులమ్ ఫ్రేమ్ వర్క్‌ను రూపొందించామని చెప్పారు. జాతీయ విద్యా విధానం ప్రకారమే 2024 విద్యా సంవత్సరానికి పాఠ్య పుస్తకాలు ప్రింట్ అవుతాయని చెప్పారు. ప్రస్తుతానికి ఏ పాఠాన్ని తొలగించలేదని పునరుద్ఘాటించారు.

NCERT

ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం నుంచే ఎన్‌సీఈఆర్‌టీ 12వ తరగతికి సూచించిన కొత్త హిస్టరీ పుస్తకాలను వినియోగించనుంది. కొత్త ఎడిషన్‌లో ఏవైతే మార్పులు చేర్పులు చేశారో ఆ పుస్తకాలనే వినియోగిస్తామని యూపీ డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్ చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+