తనపై తానే కేసు నమోదు చేసుకున్న పోలీస్ అధికారి

భోపాల్: దేశ రాజధానిలో ఓ మహిళపై ఇటుకతో దాడి చేసి పోలీసు వృత్తికి కళంకం తెచ్చిన పోలీసే కాదు.. ప్రమాదానికి కారణమై తనపై తానే కేసు నమోదు చేసుకున్న పోలీసు కూడా ఆ విభాగంలో ఉన్నారు. ఇలాంటి ఘటనే మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది.

రోడ్డు ప్రమాదానికి కారణమైన ఓ పోలీసు అధికారి తనపై తానే కేసు నమోదు చేసుకొని అసలుసిసలు పోలీస్ అని నిరూపించుకున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దిండోరిలో చోటు చేసుకుంది.

రాష్ట్రంలోని దిండోరికి చెందిన మనోజ్ త్రిపాఠి అనే పోలీసు అధికారి గర్సరాయ్ పోలీస్ స్టేషన్‌లో ఇంఛార్జీగా పని చేస్తున్నారు. ఆయన తన ప్రైవేటు వాహనంలో సగుర్తలా వైపు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు.

 Cop gets case registered against himself after accidentally injuring 3 men in road accident

దీంతో ద్విచక్రవాహనంపై ఉన్న పూల్ చంద్ర(40), రాంలాల్(25), బబ్లూ(19)లకు గాయాలయ్యాయి. మనోజ్ వెంటనే వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలంచారు. అంతేగాక, ఆయన ఇంఛార్జ్ అయిన గర్సరాయ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తనపై కేసు నమోదు చేసుకున్నారు.

తీహార్ జైల్లో ఇద్దరు ఖైదీల మృతి

న్యూఢిల్లీ: తీహార్ జైల్లో ఇద్దరు ఖైదీలు అనుమానాస్పదంగా మరణించారు. గురువారం ఉదయం ఇద్దరు ఖైదీల మృతదేహాలను గుర్తించామని పోలీసులు తెలిపారు. జైలు నెం. 8,9 లో ఉంచిన ఈ ఖైదీలిద్దరూ మత్తుమందులకు బానిసలని తెలిపారు. మృతదేహాలను పోస్ట్ మార్టానికి తరలించామని, దర్యాప్తుకు ఆదేశించామని జైలు అధికారి సునీల్ గుప్తా తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+