అఫైర్: బాంబు పెట్టి కానిస్టేబుల్‌ను చంపిన హెడ్
ముంబై: మహారాష్ట్రలో దారుణం జరిగింది. సాటి పోలీసు మీద కక్ష పెంచుకున్న హెడ్ కానిస్టేబుల్ బైక్ లో బాంబు పెట్టి చంపేశాడు. చివరికి విషయం గుర్తించిన పోలీసు అధికారులు హెడ్ కానిస్టేబుల్ ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.
రాయగడ్ జిల్లా ఎస్పీ మహమ్మద్ సువేజ్ హక్ తెలిపిన కథనం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. రాయ్ గడ్ లోని ఓ పోలీస్ స్టేషన్ లో నితేష్ పాటిల్ (28) కానిస్టేబుల్ గా పని చేస్తున్నాడు. అదే పోలీస్ స్టేషన్ లో ప్రహ్లాద్ పాటిల్ (45) హెడ్ కానిస్టేబుల్ గా ఉద్యోగం చేస్తున్నాడు.
రాయగడ్ రీజన్ లోని ఓ పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్న మహిళా కానిస్టేబుల్ తో నితేష్ కు అక్రమ సంబంధం ఉంది. ఈ విషయంలో నితేష్, ప్రహ్లాద్ చాల సార్లు గొడవలు పడ్డారు. సాటి పోలీసులు ఇద్దరికి నచ్చ చెప్పిన సందర్బాలు చాల ఉన్నాయి.

నితేష్ కు వివాహం అయ్యింది. భార్య, రెండు నెలల పాప ఉంది. అదే విధంగా ప్రహ్లాద్ కు భార్య, పిల్లలు ఉన్నారు. అయితే మహిళా కానిస్టేబుల్ విషయంలో ఇద్దరూ ఒకరి మీద ఒకరు కక్ష పెంచుకున్నారు. ఈ విషయంలో ప్రహ్లాద్ పాటిల్ సహనం కొల్పోయాడు.
ఎలాగైనా నితేష్ ను హత్య చెయ్యాలని ప్లాన్ వేశాడు. నితేష్ బైక్ లో బాంబు పెట్టాడు. నితేష్ బైక్ స్టాట్ చేస్తున్న సమయంలో బాంబు పేలిపోయింది. తీవ్రగాయాలైన నితేష్ ను ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. చికిత్స విఫలమై అతను మరణించాడని రాయగడ్ జిల్లా ఎస్పీ మహమ్మద్ సువేజ్ హక్ చెప్పారు.












Click it and Unblock the Notifications