• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జైళ్ల శాఖ డీజీపీ హత్య: సహాయకుడే హంతకుడు, అరెస్ట్, డైరీలో సంచలన విషయాలు

|
Google Oneindia TeluguNews

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్(డీజీపీ) హేమంత్ కుమార్ లోహియా హంతకుడిని పోలీసులు గంటల వ్యవధిలోని పట్టుకున్నారు. సోమవారం రాత్రంతా భారీ సంఖ్యలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

గొంతుకోసి హేమంత్ కుమార్ లోహియా హత్య

గొంతుకోసి హేమంత్ కుమార్ లోహియా హత్య

నిందితుడు, లోహియా నివాసంలో పనిచేసిన 23 ఏళ్ల సహాయకుడైన యాసిర్ అహ్మద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం నిందితుడ్ని విచారిస్తున్నట్లు ఏడీజీపీ ముఖేష్ సింగ్ తెలిపారు. 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి హేమంత్ కుమార్ లోహియా సోమవారం అర్థరాత్రి జమ్మూ శివార్లలోని తన నివాసంలో హత్యకు గురయ్యారు. 57 ఏళ్ల ఈ అధికారి గొంతు కోసి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.

డీజీపీని హత్య చేసి పరారైన నిందితుడు యాసిర్

డీజీపీని హత్య చేసి పరారైన నిందితుడు యాసిర్

క్రైమ్ సీన్ ప్రాథమిక పరీక్షలో హంతకుడు మొదట లోహియాను ఊపిరాడకుండా చేసి చంపాడని, ఆ తర్వాత అతని గొంతు కోసేందుకు పగిలిన కెచప్ బాటిల్‌ను కూడా ఉపయోగించాడని పోలీసు డైరెక్టర్ జనరల్ దిల్బాగ్ సింగ్ తెలిపారు. అనంతరం మృతదేహానికి నిప్పంటించే ప్రయత్నం చేశాడు. హత్య జరిగిన కొద్దిసేపటికే నిందితుడు పారిపోయినట్లు సీసీటీవీ ఫుటేజీలో తేలిందని ఇంతకుముందు పోలీసు వర్గాలు వెల్లడించాయి.

జీవితంపై నిరాశలో నిందితుడు యాసిర్.. పీఏఎఫ్ఎఫ్ బాధ్యతవాస్తవానికి రాంబన్ జిల్లాలోని హల్లా-దండ్రాత్ గ్రామానికి చెందిన యాసిర్ గత ఆరు నెలలుగా లోహియా నివాసంలో పనిచేస్తున్నాడు. యువకుడు దూకుడుగా ప్రవర్తించేవాడని, నిరాశకు గురైనట్లు ప్రాథమిక విచారణలో తేలితందని పోలీసులు తెలిపారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా జమ్మూకాశ్మీర్‌లో మూడు రోజుల పర్యటనలో ఉన్న సమయంలో జరిగిన లోహియా హత్యకు పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్ (పీఏఎఫ్ఎఫ్) బాధ్యత వహించింది.

ఓ మరణమా.. నా జీవితంలో రా అంటూ డైరీలో యాసిర్ అహ్మద్

కాగా, నిందితుడు యాసిర్ అహ్మద్ డైరీని పోలీసులు స్వాధీనం చేసుకుని పరిశీలించారు. పలు సంచలన విషయాలను అందులో గుర్తించారు. ఆ డైరీలో హిందీ పాటలు ఉన్నాయని.. అందులో ఒకటి 'నన్ను మర్చిపో' పేరిట రాసి ఉందని పేర్కొన్నాడు. ఓ మరణమా.. నా జీవితంలోకి రా. ప్రస్తుతం నేను నాకు నచ్చని జీవితం జీవిస్తున్నాను. ఈ జీవితం నాకు నచ్చట్లేదు. జీవితం అంటే విషాదం మాత్రమే. ప్రేమ 0 శాతం, ఆందోళన 90 శాతం, బాధ 99 శాతం, నకిలీ నవ్వు 100 శాతం అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం తాను బతుకుతున్న జీవితంతో తనకే సమస్య లేదని, కానీ, ఇబ్బంది అంతా భవిష్యత్తు గుర్తించే అని ఆ డైరీలో నిందితుడు పేర్కొన్నాడు. ప్రాథమిక దర్యాప్తులో ఉగ్రకోణం ఏమీ లేదనిపించిందని, అయితే, అన్ని కోణాల నుంచి సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపాయి. ఉగ్రకోణం ఏదీ కూడా తమ ప్రాథమిక విచారణలో కనిపించలేదని పోలీసులు పేర్కొన్నారు.

English summary
cops arrest domestic help of slain J&K prisons DGP; found shocking issues in accused's Diary.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X