ఇండియాలో క్షీణిస్తున్న కరోనా కొత్త కేసులు, మరణాలు .. 7లక్షలకు యాక్టివ్ కేసులు

భారతదేశంలో కరోనా వైరస్ రోజువారి కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో 60,753 తాజా కేసులు నమోదయ్యాక భారతదేశ కరోనా వైరస్ కేసుల సంఖ్య మొత్తం 2,98,23,546 కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది.

గత 24 గంటల్లో 1,647 మంది మృతి

గత 24 గంటల్లో 1,647 మంది మృతి

గత 24 గంటల్లో 1,647 మంది కరోనా కారణంగా మరణించగా, గత 24 గంటల్లో 97,743 మంది కరోనా మహమ్మారి బారినుండి కోలుకున్నారు. ఇప్పటి వరకు దేశంలో నమోదైన మొత్తం మరణాల సంఖ్య 3,85,137 కాగా, 2,86,78,390 ఇప్పటివరకు కరోనా నుండి పూర్తిగా కోలుకున్నారు. రోజువారీ రికవరీ వరుసగా 37 వ రోజు కొత్త కేసులను మించిపోయింది. క్రియాశీల కేసులు 7,60,019 కి తగ్గాయి. 74 రోజుల తరువాత అతి తక్కువ క్రియాశీల కేసులు కనిపిస్తున్నాయి .

 బాగా తగ్గిన యాక్టివ్ కేసులు, 2.68 శాతం మాత్రమే

బాగా తగ్గిన యాక్టివ్ కేసులు, 2.68 శాతం మాత్రమే

మొత్తం యాక్టివ్ కేసులు,దేశంలో నమోదయిన మొత్తం కేసులలో ఇవి 2.68 శాతం ఉన్నాయి.శుక్రవారం కోవిడ్ -19 పాజిటివ్‌గా 62,480 మందిని గుర్తించగా, శనివారం కేసులు శుక్రవారం కంటే 1,727 తక్కువ. మరోవైపు, శనివారం మరణించిన వారి సంఖ్య శుక్రవారం కంటే 60 ఎక్కువ, మొత్తం శుక్రవారం 1,587 మరణాలు నమోదయ్యాయి. ఇది రెండు నెలల్లో అతి తక్కువ. గత 24 గంటల్లో కోవిడ్ -19 కోసం 1.9 మిలియన్ శాంపిల్స్‌ను పరీక్షించామని, ఇప్పటి వరకు మొత్త పరీక్షించిన నమూనాలు 38,92,07,637 గా ఉన్నట్టు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) శనివారం తెలిపింది.

మే 7 తర్వాత నుండి రోజువారీ కేసుల తగ్గుదల

మే 7 తర్వాత నుండి రోజువారీ కేసుల తగ్గుదల

మే 7న దేశం 4,14,000 కేసులను నమోదు చేసినప్పటి నుండి రోజువారీ అంటువ్యాధుల తగ్గుదల ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది. "మే 7 నుండి కేసులు క్షీణిస్తూ వచ్చాయని , మే 25 న, రోజువారీ కేసులు 200,000 మార్కు కంటే తక్కువగా ఉన్నాయి. జూన్ 7 న, కేసులు 100,000 ఉన్నాయి . అప్పటి నుంచి వరుసగా లక్ష కంటే తక్కువ కేసు నమోదు అవుతున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+