వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus: బాధితుల కోసం కేంద్రం హెల్ప్ లైన్ నంబర్.. సందేహాలుంటే కాల్ చేయాలని!

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. వైరస్ బారినపడి చైనాలో ఇప్పటికే 170 మందికి పైగా చనిపోయారు. వేలాది మంది వైరస్‌తో చికిత్స పొందుతున్నారు. చైనాయే కాదు థాయ్‌లాండ్, జపాన్, సింగపూర్, బ్రిటన్, అమెరికాలో కూడా కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో మిగతా దేశాలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. వైరస్ లక్షణాలు కనిపించినా, వైరస్ సింప్టమ్స్ ఎలాంటివి ఉన్నట్టు అనిపించినా కంప్లైంట్ చేయాలని హెల్ప్‌లైన్ నంబర్ ఇస్తున్నాయి.

24 గంటలు

24 గంటలు

24 గంటలు 7 రోజులు పనిచేసేలా హెల్ప్‌లైన్ నంబర్ ఏర్పాటుచేశామని భారత ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. కరోనా వైరస్‌కు సంబంధించి ఏ విషయం తెలుసుకోవాలనుకొన్న ఫోన్ చేయాలని సూచించారు. +91-11-23978046 నంబర్ 24 గంటలు అందుబాటులో ఉంటుందని చెప్పారు. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్య శాఖ సోషల్ మీడియా ట్విట్టర్‌లో ట్వీట్ చేసింది.

కాల్ చేయండి

+91-11-23978046 నంబర్‌కు ఫోన్ చేసి అనుమానాలు నివృత్తి చేసుకోవాలని సూచించారు. వ్యాధి లక్షణాలు అనిపిస్తే వెంటనే సమీపంలోని ఆస్పత్రిలో చేరాలని సూచించారు. వైద్యారోగ్య చేసిన ట్వీట్‌కు నెటిజన్లు స్పందించారు. సిచుయేషన్ దారుణంగా ఉందని.. ఇప్పటికైనా హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని సూచించారు. మరికొందరు ట్వీట్ హిందీ, ఇంగ్లీష్‌లో కాకుండా స్థానిక భాషల్లో కూడా పెడితే బాగుంటుందని సూచించారు.

170 మంది మృతి..

170 మంది మృతి..


చైనాలోని వుహన్‌లో కరోనా వైరస్ వ్యాప్తి చెందింది. వైరస్ సోకి ఇప్పటికే 170 మంది చనిపోయారు. మరో 7700 మంది వైరస్ సోకి చికిత్స పొందుతున్నారు. మంగళవారం 132 మంది చనిపోగా.. బుధవారం ఒక్కరోజు 40 మంది వరకు మృతిచెందడం వైరస్ తీవ్రతకు అద్దంపడుతోంది. వైరస్ సోకిన 1370 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. దీంతో మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది.

English summary
Coronavirus helpline number is +91-11-23978046. please call to ant query health minister clarify.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X