బళ్లారిలో ఊహించని దెబ్బ పడింది. రెడ్డి లేని లోటు కనపడింది, ఎలక్షన్ టైమ్ లో రామరామ !
బెంగళూరు/బళ్లారి: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు తేదీ ప్రకటించిన రోజే ఆ రాస్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఇంతకాలం అధికారంలో ఉన్న బీజేపీకి ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఊహించని షాక్ ఇచ్చింది. మైనింగ్ కింగ్, మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి లేని లోటును బళ్లారిలో బీజేపీ నాయకులు మొదటిసారి రుచి చూశారు.
బళ్లారి సిటీ మేయర్ పదవి కోసం ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి స్పష్టంగా ఉన్నా దానిని బీజేపీ నాయకులు క్యాష్ చేసుకోలేకపోయారు. దెబ్బకు బీజేపీ కంచుకోటగా ఉన్న బళ్లారి సిటీ మేయర్ గా కాంగ్రెస్ పార్టీ లేడీ లీడర్ ఎన్నిక కావడం హాట్ టాపిక్ అయ్యింది. బళ్లారి సిటీ మేయర్, డిప్యూటీ మేయర్ గా కాంగ్రెస్ పార్టీకి చెందిన లేడీ కార్పోరేటర్లు ఎన్నిక కావడంతో బీజేపీ నాయకులు కంగుతిన్నారు.

బళ్లారి సిటీలో 39 మంది కార్పోరేటర్లు ఉన్నారు. ఇటీవల జరిగిన కార్పోరేన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 21 మంది కార్పోరేటర్లు, బీజేపీకి 13 మంది కార్పోరేటర్లు, ఐదు మంది స్వతంత్ర పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. అయితే మేయర్ పదవి కోసం కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు మొదలైయ్యింది. చాలా రోజుల నుంచి బళ్లారి మేయర్ ఎన్నికల లొల్లి తారాస్థాయికి చేరింది.
కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు మొదలుకావడంతో బళ్లారి మేయర్ కుర్చి దక్కించుకోవడానికి, ఆపరేషన్ కమలకు శ్రీకారం చుట్టడానికి బీజేపీకి మంచి అవకాశం చిక్కింది. అయితే చేతికి చిక్కిన అవకాశాన్ని బీజేపీ నాయకులు ఏమాత్రం సద్వినియోగం చేసుకోలేకపోయారు. స్వంతత్ర పార్టీ కార్పోరేటర్లు, కాంగ్రెస్ పార్టీకి చెందిన అసమ్మతి కార్పోరేటర్లను ఆకర్షించడంలో బీజేపీ నాయకులు పూర్తిగా విఫలం అయ్యారు.
బళ్లారి సిటీ మేయర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి కేవలం 23 ఏళ్ల వయసు ఉన్న త్రివేణి, బీజేపీ నుంచి ఉమాదేవి నామినేషన్ వేశారు. డిప్యూటీ మేయర్ పదవి కోసం కాంగ్రెస్ పార్టీకి చెందిన జానకమ్మ నామినేషన్ వేశారు. బళ్లారి మేయర్ ఎన్నికల్లో త్రివేణికి 28 ఓట్లు పడ్డాయి. బీజేపీకి చెందిన ఉమాదేవికి 16 ఓట్లు మాత్రం పడటంతో ఆమె ఓడిపోయారు. డిప్యూటీ మేయర్ పదవి కోసం ఎవ్వరూ నామినేన్ వెయ్యకపోవడంతో జానకమ్మ విజయం సాధించారు.

బళ్లారి చరిత్రతో 23 ఏళ్ల వయసులోనే మేయర్ అయిన త్రివేణి హాట్ టాపిక్ అయ్యారు. గతంలో త్రివేణి తల్లి సుశీలాబాయి కూడా బళ్లారి మేయర్ గా పని చేశారు. బళ్లారి మేయర్ ఎన్నికల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఓటు హక్కు ఉంది. అయితే అసెంబ్లీ ఎన్నికల తేదీ ప్రకటించడంతో బళ్లారి గ్రామీణ ఎమ్మెల్యే నాగేంద్ర మాత్రం ఎవ్వరికి ఓటు వెయ్యకుండా తటస్టంగా ఉండిపోవడం హాట్ టాపిక్ అయ్యింది.












Click it and Unblock the Notifications