నవదంపతుల ఆత్మహత్య: తిథి కార్యానికి వచ్చి దుర్మరణం
బెంగళూరు: జీవితంపై విరక్తి చెందిన నవ దంపతులు విషం సేవించి ఆత్మహత్య చేసుకున్న సంఘటన బెంగళూరు శివార్లలో జరిగింది. దోడ్డబళ్లాపురం తాలుకా జోగుపాళ్యలో నివాసం ఉంటున్న రుద్రేష్ (28), గౌరిబిదనూరుకు చెందిన భవ్యశ్రీ (20) ల వివాహం మూడు నెలల క్రితం జరిగింది.
దంపతులు జోగుపాళ్యలో నివాసం ఉంటున్నారు. వివాహం అయిన రెండు నెలలు వీరిద్దరు సంతోషంగానే ఉన్నారు. తరువాత దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. సోమవారం రాత్రి రుద్రేష్, భవ్యశ్రీ గొడవపడ్డారు. చుట్టు పక్కల వారు ఇద్దరికి సర్ధి చెప్పారు. రాత్రి ఇంటిలోకి వెళ్లిన ఇద్దరు విషం సేవించి ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ సమస్యలతో ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు తెలిపారు.

బావ తిథికి వచ్చి, దుర్మరణం
ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురంలో లీలావతి (60) అనే మహిళ నివాసం ఉంటున్నారు. ఈమె భావ బెంగళూరులో మరణించారు. సోమవారం బెంగళూరులోని గూరగుంటపాళ్యలోని బావ తిథి కార్యక్రమం ఎర్పాటు చేశారు. లీలావతి అనంతపురం నుండి బెంగళూరు వచ్చారు.
సోమవారం ఉదయం తిథి కార్యక్రమం ముగించుకుని అనంతపురంకు వెళ్లడానికి బావ కుమారుడి డియో స్కూటర్ లో జాలహళ్ళిలోని బస్ స్టాప్ దగ్గరకు బయలుదేరారు. మార్గం మధ్యలో స్పీడ్ బ్రేకర్ రావడంతో స్కూటర్ వేగం తగ్గించారు. అదే సమయంలో వెనుక నుండి వేగంగా వచ్చిన గ్యాస్ ట్యాంకర్ స్కూటర్ ను డీకొనడంతో తీవ్రగాయాలైన లీలావతి మరణించారు.












Click it and Unblock the Notifications