భారత్‌లో కరోనా: మళ్లీ పెరిగింది -కొత్తగా 2.11లక్షల కేసులు, 3,847 మరణాలు -24.19లక్షల యాక్టివ్ కేసులు

దేశంలో కరోనా వైరస్ రెండో దశ విలయం కొనసాగుతున్నది. దాదాపు నెలన్నర తర్వాత రోజువారీ కేసులు 2లక్షల కంటే తక్కువ వచ్చాయని సంతోషించే లోపే మళ్లీ వైరస్ వ్యాప్తి పెరిగింది. అయితే మరణాల సంఖ్య 4వేల మార్కుకు కిందికి రావడం ఊరటకలిగిస్తున్నది. రికవరీలు భారీగా నమోదవుతుండటం మరో సానుకూల అంశం..

కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం వెలువరించిన కరోనా బులిటెన్ ప్రకారం, గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 21,57,857 శాంపిళ్లను పరీక్షించగా, కొత్తగా 2,11,298 మంంది పాజిటివ్ గా నిర్ధారణ అయ్యారు. రెండో వేవ్ లో నెలన్నర గ్యాప్ తర్వాత మే 24న రోజూవారీ కేసులు రెండులక్షల(1,96,427) దిగువకు చేరగా, 25, 26తేదీల్లో మళ్లీ వైరస్ వ్యాప్తి పెరిగింది. కొత్తవాటితో కలిపి దేశంలో మొత్తం కేసులు 2,73,69,093కు పెరిగాయి.

 covid-19 in india: 2.11 Lakh new cases, 3,847 Deaths, Active cases decline to 24.19 lakh

కరోనా మహమ్మరి వల్ల నిన్న ఒక్కరోజే 3,847మంది కన్నుమూశారు. ఇప్పటివరకు 3,15,235 మంది ప్రాణాలు కోల్పోయారు. గడిచిన 24 గంటల్లో 2,83,135 మంది కొవిడ్ వ్యాధి నుంచి కోలుకున్నారు. తద్వారా రికవరీలు 2,46,33,951కు పెరిగాయి. వరసగా 14వ రోజు కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువగా నమోదయ్యాయి. దేశంలో రికవరీ రేటు ఇంకాస్త మెరుగుపడి 89.66 శాతానికి చేరినట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది.

వ్లీకీ పాజిటివిటీ రేటు ప్రస్తుతం 10.93శాతంగా ఉందని, రోజువారీ పాజిటివిటీ రేటు 9.79శాతంగా ఉందని కేంద్రం తెలిపింది. వరుసగా మూడు రోజుల్లో రోజువారీ పాజిటివిటీ రేటు పదిశాతాని కన్నా తక్కువగా నమోదైంది. ఇప్పటి వరకు మొత్తం 33,69,69,352 శాంపిళ్లను టెస్ట్‌ చేసినట్లు ఐసీఎంఆర్ పేర్కొంది. నిన్న ఒక్కరోజే 18,85,805 మందికి టీకాలు అందించగా, ఇప్పటివరకు 20,26,95, 874 డోసులను పంపిణీ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+