వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాకింగ్: ఆస్పత్రిలో నగ్నంగా కరోనా రోగులు, మహిళ బాధితురాలు కూడా

|
Google Oneindia TeluguNews

భువనేశ్వర్: ఒడిశా రాష్ట్రంలోని మయూర్భంజ్ జిల్లాలోని కరోనా ఆస్పత్రిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆ ఆస్పత్రిలో కొందరో కరోనా రోగులు నగ్నంగా బాత్రూంలో, బెడ్లపైనా పడివున్న ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ రోగుల్లో ఓ మహిళ కూడా ఉండటం గమనార్హం. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించింది.

ఆస్పత్రిలో రోగులు నగ్నంగా..

ఆస్పత్రిలో రోగులు నగ్నంగా..

బంకిసోలేలో ఏర్పాటు చేయబడిన ఈ ఆస్పత్రిలో కరోనా రోగులు నగ్నంగా ఉండటాన్ని ఓ బాధితుడితో వచ్చిన సహాయకుడు ఫొటోలు, వీడియోలు తీసి వైరల్ చేశాడు. ఈ ఆస్పత్రిలో రోగుల చికిత్స కోసం కళింగ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(కిమ్స్)తో మయూర్భంజ్ పరిపాలన అధికారులు ఒప్పందం కుదుర్చుకున్నారు.

వైద్య సిబ్బంది నిర్లక్ష్యం.. కరోనా బాధితుడి కుమారుడి ఆవేదన

వైద్య సిబ్బంది నిర్లక్ష్యం.. కరోనా బాధితుడి కుమారుడి ఆవేదన

'నా తండ్రిని మే 19న చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్లాను. నేను కూడా అక్కడే ఉన్నాను. బాత్రూంలో బాధితులు తమ ప్రాణాలను కోల్పోవడం చూశాను. ఆహారం లేకపోవడంతో వారంతా ఆరోగ్యం క్షీణించి చనిపోతున్నారు. కనీసం బాత్రూంకు కూడా వెళ్లలేకపోతున్నారు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారు. వైద్య సిబ్బంది ఎప్పుడో ఒకసారి మాత్రమే ఇక్కడికి వస్తుంటారు. మే 19-29 మధ్య కాలంలో నలుగురు మృతి చెందారు' అని అజిత్ సాహూ అనే బరిపడ గ్రామానికి చెందిన కరోనా బాధితుడి బంధువు తన వీడియో సందేశంలో పేర్కొన్నాడు.

Recommended Video

Cyclone Yaas Landfall Visuals ఉప్పొంగి విరుచుకుపడ్డ సముద్రం | Tsunami | Floods | Oneindia Telugu
అంతా బాగానే ఉందంటూ కలెక్టర్..

అంతా బాగానే ఉందంటూ కలెక్టర్..


ఈ ఆస్పత్రిలో కరోనా బాధితులను వైద్య సిబ్బంది పట్టించుకోవడం లేదని తెలిపాడు. పీపీఈ కిట్ ధరించిన వైద్యులు ఇక్కడికి వచ్చి వెళ్తుంటారు కానీ, కరోనా రోగులకు ఎలాంటి వైద్యం అందించడం లేదని చెప్పారు. తగిన సిబ్బంది కూడా ఇక్కడ లేరని తెలిపారు. ఆస్పత్రిలో దారుణ పరిస్థితులున్నాయని, కరోనా రోగులకు కనీసం వేసుకునేందుకు బట్టలు కూడా లేవని, నగ్నంగాను బెడ్లపై పడుకున్నారని మయూర్భంజ్ కలెక్టర్ వినీత్ భరద్వాజ్ దృష్టికి స్థానికులు తీసుకెళ్లారు. కాగా, కలెక్టర్ భరద్వాజ్ ఆస్పత్రి ఆవరణను పరిశీలించారు. ఆ తర్వాత మాట్లాడుతూ.. ఇక్కడ బాధితులంతా చికిత్స పట్ల సంతృప్తితో ఉన్నారని తెలిపారు. ఆస్పత్రిపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. కాగా, ఉన్నతాధికారులు ఈ వీడియో ఘటనలపై విచారణకు ఆదేశించారు.

English summary
After disturbing photographs of patients, including a woman, lying naked on the floor of a washroom and bed in a COVID-19 hospital in the tribal dominated Odisha’s Mayurbhanj district went viral, a high-level probe has been ordered.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X