భారత్‌లో కరోనా: జులైలో రెండో వేవ్ అంతం -ఆరు నెలల్లోనే మూడో వేవ్ -ప్రభుత్వ కమిటీ సంచలన రిపోర్ట్

దేశంలో కరోనా మహమ్మారి రెండో దశ విలయం అత్యంత ప్రమాదకరంగా కొనసాగుతూ, ప్రతిరోజూ 4వేలకు తక్కువ కాకుండా మరణాలు నమోదవుతున్నాయి. రోజువారీ కొత్త కేసులు కాస్త తగ్గుముఖం పట్టినట్లు అనిపించినా, మే నెలాఖరులో మళ్లీ విజృంభణ తప్పదని, మొత్తంగా జులై చివరినాటికిగానీ సెకండ్ వేవ్ అంతం కాదని సైంటిస్టులు చెబుతున్నారు.

Recommended Video

    Covid-19 Second Wave To End In July, Third Wave After 6 Months Says Govt Panel || Oneindia Telugu

    కరోనా మహమ్మారి స్థితిగతుల అంచనాలపై కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలో సూత్ర మోడల్ ఆధారంగా ఏర్పడిన నిపుణుల కమిటీ దేశంలో వైరస్ రెండో, మూడో వేవ్ లపై కీలక రిపోర్టును రూపొందించింది. పలు ఐఐటీల సైంటిస్టులు సభ్యులుగా ఉన్న ప్రభుత్వ ప్యానెల్ అంచనాల ప్రకారం దేశంలో కరోనా రెండో దశ వేవ్ జులై చివరినాటికి అంతం అవుతుంది. కానీ..

    covid-second-wave-to-end-in-july-third-wave-after-6-months-says-sutra-govt-panel

    ప్రస్తుతం కొనసాగుతోన్న సెకండ్ వేవ్ లో ఇంకా చాలా రాష్ట్రాలు కొత్త కేసుల పీక్ దశను చూడాల్సి ఉందని, ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో మే చివరి వారం నాటికి కొత్త కేసులు భారీగా వస్తాయని, తమిళనాడులో మే 31లోపు, అస్సాంలో మే 20 తర్వాత పీక్ దశ ఉంటుందని కమిటీ అంచనా వేసింది. అలాగే మేఘాలయ, త్రిపురలోనూ మే మాసాంతంలో కేసులు పెరుగుతాయని చెప్పింది. హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, లోనూ అదే పరిస్థితి ఉండొచ్చని తెలిపింది. ఇప్పటికే మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, జార్ఖండ్, రాజస్థాన్, కేరళ, సిక్కిం, ఉత్తరాఖండ్, గుజరాత్, హర్యానా, ఢిల్లీ, గోవాలు పీక్స్ ను చూశాయని ప్యానెల్ పేర్కొంది.

    దేశంలో కరోనా వైరస్ మూడో దశ వ్యాప్తికి చాలా అవకాశాలున్నాయిని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలోని ప్రభుత్వ ప్యానెల్ అంచనా వేస్తున్నది. జులైలో సెకండ్ వేవ్ ముగిసిన తర్వాత ఆరు నెలల తర్వాత మూడో వేవ్ తలెత్తొచ్చని చెప్పింది. అయితే ఆలోపు కొవిడ్ వ్యాక్సిన్లు విస్తృత స్థాయిలో అందుబాటులోకి వస్తే గనుక పరిస్థితి కొంత మెరుగయ్యే అవకాశం ఉంటుందని కమిటీ తెలిపింది. కాగా,

    సూత్ర మోడల్ ఆధారంగా ఏర్పడిన ఈ ప్రభుత్వ కమిటీ దేశంలో కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తిని అంచనా వేయడంలో పూర్తిగా విఫలమైన దరిమిలా సెకండ్ వేవ్ జులైలో ముగుస్తుందని, ఆ తర్వాత ఆరు నెలలకు మూడో వేవ్ వస్తుందని చెబుతోన్న విషయాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెండో దశ విలయాన్ని పసిగట్టడంలో ప్యానెల్ విఫలమైందని సభ్యులే ఒప్పుకుంటుండటం గమనార్హం.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+