కోవిన్ పోర్టల్ ఇక హిందీలోనూ: తెలుగుతోపాటు మరో 10 ప్రాంతీయ భాషల్లో కూడా

న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కోవిన్ పోర్టల్‌లో పలు కీలక మార్పులు చేసింది. హిందీతోపాటు 10 ప్రాంతీయ భాషల్లోకి అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు శుక్రవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

తెలుగు, మలయాళం, మరాఠీ, గుజరాతీ, పంజాబీ, అస్సామీ, బెంగాలీ, కన్నడ, ఒడియా భాషల్లోనూ రిజిస్ట్రేషన్ చేసుకునేలా మార్పులు చేసినట్లు తెలిపింది. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి నేతృత్వంలో జరిగిన ఉన్నతస్థాయి మంత్రుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

CoWIN Portal is Now Available in Hindi, 10 Regional Languages Including Punjabi, Telugu

దేశంలో 18 ఏళ్లు పైబడినవారు కరోనా టీకా పొందాలంటే కోవిన్ పోర్టల్‌లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. కాగా, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ సమయంలో భాష కారణంగా సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో ప్రజలు టీకా కేంద్రాల్లోని సిబ్బంది సహకారం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో వారిపై పని ఒత్తిడి పెరిగింది.

ఈ విషయాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం.. హిందీతోపాటు 10 ప్రాంతీయ భాషల్లోకి కోవిన్ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. వైద్య సిబ్బందిపై ఒత్తిడి తగ్గడం వల్ల ఎక్కువ మందికి టీకాలు ఇచ్చే అవకాశాలు పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది. జనవరిలో ప్రారంభమైన కరోనా వ్యాక్సిన్ కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు దేశంలో 22 కోట్ల మందికిపైగా వ్యాక్సిన్ వేయించారు.

పరీక్షించిన నమూనాల సంఖ్యను పెంచడానికి మరియు, మరింత ప్రాదేశిక విశ్లేషణకు అనుమతించడానికి 17 కొత్త ప్రయోగశాలలను ఇన్సాకోగ్ నెట్‌వర్క్‌కు చేర్చబోతున్నామని కేంద్రమంత్రి హర్షవర్ధన్ తన సహచరులకు తెలియజేశారు. ఈ నెట్‌వర్క్ ప్రస్తుతం దేశంలోని వివిధ మూలల్లో ఉన్న 10 ప్రయోగశాలల ద్వారా సేవలు అందిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+