విదేశీయుడు ఏడు బ్యాంకు అకౌంట్లు సీజ్, ఐటీ హబ్ వచ్చి సార్ ఏం చేస్తున్నాడంటే ?, వీడు తోపు !
ఐటీ హబ్ బెంగళూరులోని యూత్, టెక్కీలు, విలాసవంతమైన జీవితానికి అలవాటుపడిన శ్రీమంతుల పిల్లలు, కాలేజ్ విద్యార్థులను టార్గెట్ చేసుకుని డ్రగ్స్, గంజాయి, మత్తు పదార్థాలు విక్రయించే ముఠా సభ్యులు ఎక్కువ అయ్యారు. డ్రగ్స్ దందా అరికట్టడానికి బెంగళూరు పోలీసులు, సీసీబీ పోలీసులు అనేక కఠిన చర్యలు తీసుకుంటున్నా వారిని అరికట్టడం సాధ్యం కావడం లేదని అధికారులు అంటున్నారు.
విదేశాల నుంచి బెంగళూరులో చదువు కోవడానికి, వ్యాపారం చెయ్యడానికి వీసాలు తీసుకుని వస్తున్న నైజీరియన్లు ఉద్దరగా లక్షలు, కోట్లలో డబ్బు సంపాధించాలనే ఆశతో డ్రగ్స్ వ్యాపారం చెయ్యడం మొదలుపెట్టారు. డ్రగ్స్ విక్రయించే దందాలో ఎక్కువగా నైజీరియన్లను బెంగళూరు పోలీసులు అరెస్టు చెయ్యడంతో వాళ్లు ఏరైంజ్ లో మత్తుపదార్థాల వ్యాపారం చేస్తున్నారో అర్థం అవుతోంది.

దేశంలోనే తొలిసారిగా బెంగళూరులోని సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) పోలీసులు విదేశీ డ్రగ్స్ వ్యాపారి బ్యాంకు ఖాతాల జప్తు చేశారు. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్ (ఎన్‌డీపీఎస్)లో అందించిన అధికారాలను ఉపయోగించడం ద్వారా డబ్బు జప్తు చేయబడింది. గత నవంబర్‌లో బెంగళూరులోని విద్యారణ్యపుర పోలీస్ స్టేషన్ అధికారులు నైజీరియాకు చెందిన మాదకద్రవ్యాల వ్యాపారి పీటర్ ఇకెడి బిలాన్వో (38)ను అరెస్టు చేశారు.

ఈ కేసును దర్యాప్తు చేసిన బెంగళూరు సీసీబీ పోలీసులు ఎన్‌డీపీఎస్ చట్టం కింద తన అధికారాన్ని వినియోగించుకుని డ్రగ్స్ వ్యాపారం చేస్తున్న నిందితుడికి చెందిన ఏడు బ్యాంకు ఖాతాల్లోని నగదుతో పాటు మొత్తం రూ 12. 60 లక్షలను జప్తు చేసింది. దీనిని కాంపిటెంట్ అథారిటీ, చెన్నై అడ్మినిస్ట్రేటర్ ఆమోదించారు.
బెంగళూరులో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో నగర పోలీస్ కమిషనర్ బి.దయానంద్ మాట్లాడుతూ అక్రమంగా సంపాదించిన సొమ్మును ఓ విదేశీ డ్రగ్స్ వ్యాపారి నుంచి స్వాధీనం చేసుకోవడం భారతదేశంలోనే ఇదే తొలిసారి అని తెలిపారు. మొత్తం మీద బెంగళూరులో డ్రగ్సై్ వ్యాపారం చేస్తున్న విదేశీయుల బ్యాంకు ఖాతాలు సీజ్ చేసే పని మొదలు పెట్టడంతో ఐటీ హబ్ లో డ్రగ్స్ వ్యాపారం చేస్తున్న విదేశీయుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని పోలీసు అధికారులు అంటున్నారు.












Click it and Unblock the Notifications