కొత్త ఉద్యోగి భారీ స్కామ్.. 100% డిస్కౌంట్ కోడ్స్‌తో లక్షల దోపిడీ !

ఢిల్లీకి చెందిన స్నీకర్ బ్రాండ్ 'గల్లీ ల్యాబ్స్' సహ-వ్యవస్థాపకుడు అర్జున్ సింగ్.. తమ సంస్థలో జరిగిన ఓ మోసం గురించి వివరించారు. ఓ ఉద్యోగి 100 శాతం డిస్కౌంట్ కూపన్‌లను సృష్టించి.. రూ.2 లక్షల విలువైన స్నీకర్లను వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించుకుని మోసం చేశాడని ఆయన 'X' (గతంలో ట్విట్టర్) లో పోస్ట్ చేశారు. ఈ సంఘటన సంస్థకు ఆర్థిక నష్టాన్ని కలిగించడమే కాకుండా, ఉద్యోగుల పట్ల విశ్వసనీయతపై తీవ్ర ప్రశ్నలను లేవనెత్తింది.

సింగ్ చెప్పిన వివరాల ప్రకారం.. ఆ ఉద్యోగి సంస్థలో చేరిన మొదటి వారంలోనే వంద శాతం డిస్కౌంట్ కూపన్‌లను రూపొందించాడు. వీటిని ఉపయోగించి తన స్నేహితులు, కుటుంబ సభ్యుల కోసం చెప్పులను ఆర్డర్ చేసి, ఆ తర్వాత రాజీనామా చేశాడు. "కొన్ని నెలల క్రితం మేము ఒక కస్టమర్ సర్వీస్ వ్యక్తిని నియమించుకున్నాం. అతను చేరిన మొదటి వారం లోనే రూ.2 లక్షల విలువైన 100% డిస్కౌంట్ ఆర్డర్లు చేశాడు - తన స్నేహితులకు పంపి, వారం లోనే మానేసాడు" అని సింగ్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

crime-news-about-new-employee-make-fraud-with-using-100-percent-discount-codes-worth-of-2-lakhs

మోసం బయటపడినప్పుడు, ఆ ఉద్యోగి స్నీకర్లను తిరిగి ఇవ్వడానికి మొదట అంగీకరించాడు. అయితే, గల్లీ ల్యాబ్స్ బృందం దొంగిలించబడిన ఉత్పత్తులలో సగం మాత్రమే తిరిగి పొందగలిగింది. మిగిలిన వాటిని తిరిగి ఇవ్వకపోగా, సదరు మాజీ ఉద్యోగి, తమను వేధిస్తున్నాడని ఆరోపిస్తూ న్యాయ నోటీసులు పంపడం ప్రారంభించాడని సింగ్ తెలిపారు.

“పట్టుకున్నప్పుడు - మొదట అతను సహకరించడానికి అంగీకరించాడు, సగం బూట్లను తిరిగి ఇచ్చాడు గానీ మిగిలిన సగం వాడేసుకున్నారు. ఆ తర్వాత అతను ఉత్పత్తులను తిరిగి ఇవ్వమని లేదా మాకు తిరిగి చెల్లించమని మేము పంపిన నోటీసుకు సమాధానంగా, మమ్మల్ని వేధిస్తున్నామని లీగల్ నోటీసులు పంపడం మొదలుపెట్టాడు!” అని సింగ్‌ వివరించారు. ఈ సంఘటన తమ సంస్థలో మరింత కట్టుదిట్టమైన భద్రతా చర్యలను అమలు చేయడానికి ప్రేరేపించిందని 'గల్లీ ల్యాబ్స్' సహ-వ్యవస్థాపకుడు తెలిపారు.

సింగ్ ఈ విషయాన్ని మరో వ్యాపారవేత్త అక్షయ్ జైన్ పోస్ట్‌కు బదులుగా పంచుకున్నారు. బ్రాండ్‌లు వృద్ధి చెందుతున్న కొద్దీ అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందని జైన్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. తమ సంస్థ కూడా ఉద్యోగుల నుండి కస్టమర్, ఆర్డర్ వివరాలను కాపాడుకోవలసి వస్తుందని ఆయన వివరించారు.

"బ్రాండ్‌లు పెరిగినప్పుడు, వారికి కొత్త సవాళ్లు వస్తాయి. భద్రతా కారణాల వల్ల ఒకే సంస్థలోని వ్యక్తుల నుండి కస్టమర్ వివరాలు, ఆర్డర్ డేటాను కాపాడుకోవాల్సి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఇది సంక్లిష్టతను పెంచుతుంది, కానీ వేరే మార్గం లేదు" అని జైన్‌ Xలో రాశారు. ఈ పోస్ట్‌లు నీతి, కస్టమర్ సేవ, మరియు అంతర్గత భద్రత గురించి విస్తృత చర్చకు దారితీశాయి.

"ఇది విశ్వసనీయత తక్కువగా ఉన్న సమాజంలోని సమస్యలు" అని ఒక X వినియోగదారు వ్యాఖ్యానించగా, మరొకరు "మీరు నమ్మలేకపోవచ్చు కానీ జబాంగ్ ఎలా మూసివేయబడిందో అది ఇలాగే. వారికి 30% అపరిమిత ఉద్యోగుల డిస్కౌంట్ కోడ్ ఉండేది మరియు వారి ఉద్యోగులందరూ ఆ డిస్కౌంట్ కోడ్‌లను కుటుంబ సభ్యులకు, స్నేహితులకు అమ్మి సంస్థకు కోలుకోలేని నష్టం కలిగించారు" అని మరో ఉదాహరణతో పంచుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+