బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Third degree: యువకుడి మర్మాంగానికి కరెంట్ షాక్ పెట్టిన పోలీసులు ?, ఏం జరిగిందంటే !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఒక హత్య కేసుకు సంబంధించి ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్ లో యువకుడికి పోలీసులు చుక్కలు చూపించారు. హత్య కేసుతో సంబంధం ఉందని అంగీకరించాలని ఆ యువకుడిని చితకబాదేశారని ఆరోపణలు ఉన్నాయి. సుమారు 11 రోజుల పాటు ఆ యువకుడిని కోర్టు ముందు హాజరుపరచకుండా పోలీస్ కస్టడీలోనే పెట్టుకుని నరకం చూపించారని బాధితుడు ఆరోపిస్తున్నాడు. చెయ్యని హత్య చేసినట్లు అంగీకరించమని తనను టార్చర్ పెట్టడమే కాకుండా పోలీస్ స్టేషన్ లో తన మర్మాంగానికి కరెంట్ షాక్ పెట్టి హత్య చెయ్యడానికి ప్రయత్నించారని ఆరోపిస్తూ బాధితుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, హోమంత్రిత్వ శాఖ అధికారులకు లేఖ రాయడం కలకలం రేపింది. ప్రముఖ ఆంగ్ల పత్రిక ఈ తతంగం మొత్తం కథనం ప్రచురించడంతో పోలీసులు ఉలిక్కిపడ్డారు. బాధితుడు ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

Wife: ఇద్దరు భార్యల ముద్దుల మొగుడు, ఫైటింగ్, విరక్తితో నవ వదువు ?, భర్తకు, ఫస్ట్ భార్యకు క్లైమాక్స్ !Wife: ఇద్దరు భార్యల ముద్దుల మొగుడు, ఫైటింగ్, విరక్తితో నవ వదువు ?, భర్తకు, ఫస్ట్ భార్యకు క్లైమాక్స్ !

 హత్య కేసులో అరెస్టు

హత్య కేసులో అరెస్టు

బెంగళూరు నగరంలోని రామమూర్తి నగర పోలీస్ స్టేషన్ పరిధిలోని విజనాపురలో రాజేష్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఈనెల 4వ తేదీన రాజేష్ ఫోన్ లో మాట్లాడుతున్న సమయంలో రామమూర్తి నగర పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఒక హత్య కేసుకు సంబంధించి రాజేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 సినిమా చూపించిన పోలీసులు ?

సినిమా చూపించిన పోలీసులు ?

పోలీస్ స్టేషన్ లో రాజేష్ కు పోలీసులు చుక్కలు చూపించారు. హత్య కేసుతో సంబంధం ఉందని అంగీకరించాలని రాజేష్ ను చితకబాదేశారని ఆరోపణలు ఉన్నాయి. అయితే తాను ఆ హత్య చెయ్యలేదని, ఆ హత్యకు తనకు ఎలాంటి సంబందం లేదని విజనాపుర నివాసి రాజేష్ అంటున్నాడు.

 15వ తేదీ వరకు నరకం చూపించారు

15వ తేదీ వరకు నరకం చూపించారు

ఈనెల 4వ తేదీ నుంచి 15వ తేదీ వరకు తాను పోలీసు కస్టడీలోనే ఉన్నానని రాజేష్ బెంగళూరు మిర్రర్ పత్రికకు ఇంటర్వూ ఇచ్చాడు.

11 రోజుల పాటు తనను కోర్టు ముందు హాజరుపరచకుండా పోలీస్ కస్టడీలోనే పెట్టుకుని నరకం చూపించారని, 8 మంద పోలీసులు ప్రతిరోజు చితకబాదేశారని బాధితుడు రాజేష్ ఆరోపిస్తున్నాడు.

 మర్మాంగానికి కరెంట్ షాక్

మర్మాంగానికి కరెంట్ షాక్

చెయ్యని హత్య చేసినట్లు అంగీకరించమని తనను టార్చర్ పెట్టడమే కాకుండా పోలీస్ స్టేషన్ లో తన మర్మాంగానికి కరెంట్ షాక్ పెట్టి హత్య చెయ్యడానికి ప్రయత్నించారని ఆరోపిస్తూ బాధితుడు రాజేష్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, హోమంత్రిత్వ శాఖ అధికారులకు లేఖ రాయడం కలకలం రేపింది.

 ఏ ఆసుపత్రికి తీసుకెళ్లారంటే ?

ఏ ఆసుపత్రికి తీసుకెళ్లారంటే ?

పోలీసులు నేరస్తుడిని ఆసుపత్రికి పిలుచుకుని వెళ్లాలంటే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి పిలుచుకుని వెళ్లాలని. అయితే కేఆర్ పురం, బౌరింగ్ ఆసుపత్రి కాకుండా రాజేష్ ను విక్టోరియా ఆసుపత్రికి పిలుచుకుని వెళ్లి చికిత్స చేయించారని, తనను హత్య చెయ్యడానికి ఇన్స్ పెక్టర్, సబ్ ఇన్స్ పెక్టర్, 8 మంది పోలీసులు ప్రయత్నించారని రాజేష్ ఆరోపిస్తున్నాడు.

 ఇన్స్ పెక్టర్ క్లారిటీ

ఇన్స్ పెక్టర్ క్లారిటీ

రాజేస్ చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని, అతను మద్యం, డ్రగ్స్ కు బానిస అయ్యాడని, ఎక్కడెక్కడో గాయాలు చేసుకుని వచ్చి మా మీద ఆరోపణలు చేస్తున్నాడని రామమూర్తి నగర పోలీస్ స్టేషన్ ఇన్స్ పెక్టర్ మేల్విన్ ఫ్రాన్సిస్ అంటున్నారని బెంగళూరు మిర్రర్ పత్రిక కథనం ప్రచురించింది. అయితే నేరస్తుడికి పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని వెలుగు చూడటం బెంగళూరులో కలకలం రేపింది.

English summary
Crime: Ramamurthy Nagar police accused of third degree torture to an murder case accused in Bengaluru city.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X