రష్యా ఉక్రెయిన్ యుద్ధంతో కొండెక్కిన ఎరువుల ధరలు,మోదీ చాకచక్యంతో..!!

రష్యా ఉక్రెయిన్‌ దేశాల మధ్య యుద్ధ ప్రభావం పలు ముడిసరుకులు, వస్తువుల ధరలపై పడింది. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఎరువుల ధరలు కొండెక్కి కూర్చొన్నాయి. భారత్ ఎరువుల దిగుమతి కోసం రష్యా ఉక్రెయిన్ దేశాలపై ఆధారపడుతోంది.నైట్రోజెన్, ఫోటాసిక్, ఫాస్ఫరస్‌లతో కూడిన ఎరువులను పెద్ద మొత్తంలో రష్యా ఎగుమతి చేస్తోంది.ఉక్రెయిన్‌తో యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో సప్లయ్‌ను రష్యా నిలిపివేసింది. దీంతో రష్యాపై ఆధారపడ్డ భారత్‌‌కు నష్టం చేకూరింది. ఇక తప్పని పరిస్థితుల్లో ధరలు పెంచాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.అయితే మోదీ సర్కార్ మాత్రం రైతులను ఆదుకునేందుకు ఈ షాక్‌నుంచి కోలుకునేందుకు చర్యలు చేపట్టింది.

సబ్సీడీలతో రైతులకు అండగా..

ఎరువుల ధరలు తారాస్థాయికి చేరడంతో రైతులకు బాసటగా నిలిచేందుకు మోదీ ప్రభుత్వం ఉపక్రమించింది. ఇందులో భాగంగా 2022-23కు గాను కేంద్ర ప్రభుత్వం ఎరువుల సబ్సీడీ కోసం 2.25 లక్షల కోట్లు ఖర్చు చేసింది. తద్వారా అంతర్జాతీయంగా ఎరువుల ధరలు పెరిగినప్పటికీ ఆ ప్రభావం రైతులపై పడకూడదన్న మంచి నిర్ణయంతో మోదీ సర్కార్ ఈ చర్యలు చేపట్టింది. ఇక 2023-24వ సంవత్సరంలో సబ్సిడీ కోసం రూ.1.89 లక్షల కోట్లు ఖర్చు చేసింది. అది 2022-23తో పోలిస్తే కొంత తక్కువైనప్పటికీ భవిష్యత్తులో ఈ అంకెను పెంచేందుకు కృషిచేస్తామని పేర్కొంది. అయితే రైతుపై ఎలాంటి అదనపు ఆర్థికభారం పడకుండా చూసుకునే బాధ్యత తమదని స్పష్టం చేసింది.

Crisis Management How India s Modi Balances Fertilizer Subsidies During Russia-Ukraine Tensions

ఆర్థిక ప్రభావం-వాణిజ్యం

మోదీ ప్రభుత్వం పెద్ద ఎత్తున తీసుకొచ్చిన సబ్సీడీలతో రైతుకు కాస్త ఊరట లభించింది.అయితే రైతు సంక్షేమం కోసం ఉద్యోగ కల్పన, వనరుల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు కేటాయించిన నిధులను కొంత వరకు మళ్లించి, ఆ నిధులను ఎరువుల సబ్సీడీ పథకం కోసం వినియోగించారు. అందులో కొన్ని ఉదాహరణలు.

ఉద్యోగ కల్పన మరియు వనరులు: ఉద్యోగ కల్పన మరియు వనరుల అభివృద్ధి కోసం కేటాయించిన నిధులు వీటికే వినియోగించి ఉండొచ్చు. కానీ రైతులకు పెరుగుతున్న ధరల నుంచి ఉపశమనం కలిగించాలన్న తలంపుతో ఈ నిధులు ఎరువుల సబ్సీడీ కోసం ఖర్చు చేసింది కేంద్ర ప్రభుత్వం.తద్వారా రైతుకు తొలి ప్రాధాన్యత ఇచ్చింది.

సంక్షేమ కార్యక్రమాలు: ఇక సంక్షేమ కార్యక్రమాల అమల్లో కాస్త జాప్యం జరుగుతోంది. దీనికి కారణం సంక్షేమ కార్యక్రమాల కోసం కేటాయించిన నిధుల్లో కొంత భాగం వ్యవసాయ రంగానికి కేటాయించాల్సి వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లలో పెరుగుతున్న ఒత్తిడిని తట్టుకుని రైతుకు ఉపశమనం కల్పించే దిశలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

దౌత్య సంబంధాలు, సప్లయ్‌లో స్థితిస్థాపకత

భారత్ సబ్సీడీల మీదనే ఆధారపడలేదు అదే సమయంలో రష్యాతో దౌత్య సంబంధాలను బలోపేతం చేసుకుంది.రష్యాలో ఓ వైపు యుద్ధ మేఘాలు అలుముకున్నప్పటికీ.. రష్యా నుంచి ఎరువులను దిగుమతి చేసుకోవడంలో మోదీ సర్కార్ చేసిన ప్రయత్నం ఫలితాలను ఇచ్చింది.రష్యా నుంచి ఫెర్టిలైజర్ల దిగుమతి ఇంకా ఎక్కువగా జరిగింది.

దీర్ఘకాలిక వ్యూహం

సబ్సీడీల ద్వారా రైతులకు తాత్కాలిక పరిష్కారం చూపినా.. మోదీ ప్రభుత్వం మాత్రం దీర్ఘకాలంలో శాశ్వత పరిష్కారం కోసం ఆలోచన చేస్తోంది. ఇందులో భాగంగా:

దేశీయ ఉత్పత్తిని పెంచి దిగుమతులపై ఆధారపడటం క్రమంగా తగ్గించుకుంటూ రావడం

స్థిరమైన వ్యవసాయ కిటుకులను అమలు చేస్తూ అధిక స్థాయిలో ఎరువుల వినియోగం క్రమంగా తగ్గించడం

సప్లయ్ చైన్‌ విధానంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా వనరులపై ఇన్వెస్ట్ చేయడం వంటి వ్యూహాల పై కేంద్రం చర్చిస్తోంది.

Crisis Management How India s Modi Balances Fertilizer Subsidies During Russia-Ukraine Tensions

చివరిగా...

ఓ వైపు ఎరువుల ధరలు పెరగడంతో సబ్సీడీల ద్వారా రైతులను, సామాన్యులను ఆదుకుంటూనే మరో వైపు ఆర్థికంగా నష్టం వాటిల్లకుండా సమాంతరంగా ఆయా దేశాలతో మోదీ ప్రభుత్వం చేస్తున్న చర్చలను స్వాగతిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.ఆహార భద్రత, ఆర్థిక సుస్థిరతను సమాంతరంగా ఉండేలా చూసుకుంటూనే దీర్ఘకాలంలో విదేశీ వస్తువులపై ఆధారపడటం తగ్గించుకుని సొంత ఉత్పత్తులను ప్రోత్సహించే దిశగా ముఖ్యంగా ఎరువుల రంగంలో అన్ని చర్యలు తీసుకుంటోంది మోదీ ప్రభుత్వం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+