Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Bengaluru: రక్షణ శాఖ భూములకు రక్షణ లేదు, హెచ్ఏఎల్ భూములు లీజ్ కు ఇస్తామని, ఓరేయ్ జైన్ ?

కొంచెం కళ్లు మూసుకుంటే నిందితులు బెంగళూరులోని విధాన సౌధ, ఎయిర్ పోర్టు కూడా మాదే అని అమ్మేసే రకంగా కనపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన భూముల మీద రియల్ ఎస్టేట్ వ్యాపారుల కన్నుపడింది.

బెంగళూరు/న్యూఢిల్లీ/ముంబాయి: కేంద్ర ప్రభుత్వానికి చెందిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్)కి చెందిన 833 ఎకరాల భూములపను అక్రమంగా లీజుకు ఇస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి సహా ఏడు మంది నిందితులను బెంగళూరులోని హెచ్‌ఏఎల్ పోలీసులు అరెస్ట్ చేశారు. కొంచెం కళ్లు మూసుకుంటే నిందితులు బెంగళూరులోని విధాన సౌధ, ఎయిర్ పోర్టు కూడా మాదే అని అమ్మేసే రకంగా కనపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన భూముల మీద రియల్ ఎస్టేట్ వ్యాపారుల కన్నుపడటం కలకలం రేపింది. కోట్ల రూపాయల డబ్బులు తీసుకుని హెచ్ఏఎల్ నకిలి లెటర్ హెడ్స్, నకిలి సీల్లు తయారు చేసి హెచ్ఏఎల్ భూములు లీజుకు ఇచ్చినట్లు నకిలి పత్రాలు తయారు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. ఇప్పటికే హెచ్ఎఎల్ భూముల నకిలి లీజుల వ్యవహారం సీబీఐ అధికారులు దర్యాప్తు చేశారు. బెంగళూరులో హెచ్ఏఎల్ భూముల కబ్జాకు ప్రయత్నించడంతో ప్రజలు హడలిపోయారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి స్కెచ్ గురించి తెలుసుకున్న పోలీసు అధికారులు కూడా షాక్ అయ్యారు.

ఎంజీ రోడ్డులో ?

ఎంజీ రోడ్డులో ?

బెంగళూరు సిటీలోని ఎం.జీ రోడ్డులోని విక్టోరియా లేఔట్ లో నివాసం ఉంటున్న రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి సురేష్‌ జైన్‌, అతని కార్యాలయంలో పనిచేసే రాజ్‌కుమార్‌, శ్రీనివాసమూర్తి, వైజయంత్‌, ప్రతాప్‌, రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్లు సయ్యద్‌ మున్నావర్‌, సయ్యద్‌ అఫ్రోజ్‌లను బెంగళూరులోని హెచ్ఏఎల్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి కొన్ని పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ మోసానికి సూత్రధారిగా చెబుతున్న బినీష్ థామస్ అజ్ఞాతంలో ఉన్నాడని, అతని ఆచూకీ కోసం గాలిస్తున్నామని బెంగళూరులోని వైట్ ఫీల్డ్ డివిజన్ డీసీపీ ఎస్.గిరీష్ మీడియాకు చెప్పారు.

హెచ్ఏఎల్ భూముల మీద కన్నుపడింది

హెచ్ఏఎల్ భూముల మీద కన్నుపడింది

బెంగళూరులోని మారతహళ్లి చుట్టుపక్కల హెచ్‌ఏఎల్‌ కంపెనీకి చెందిన 833 ఎకరాల భూమి ఉంది. ఆ భూములు చాలా వరకు ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీ భూమిపై భూమాఫియా కన్ను పడిందని వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది. ఇప్పటికే రెండు, మూడు సార్లు కొందరు నకిలీ పత్రాలు సృష్టించి హెచ్ఏఎల్ భూములను కబ్జా చెయ్యడానికి యత్నించారు. ఇప్పుడు అదే కోవలోకి రియల్ ఎస్టేట్ వ్యాపారి సురేష్ జైన్ అండ్ టీమ్ చేరింది. ఇటీవల హెచ్‌ఏఎల్‌ బోర్డు ఆఫ్‌ డైరెక్టర్ల సమావేశంలో హెచ్‌ఏఎల్‌ కంపెనీకి చెందిన 833 ఎకరాల భూమిని 30 ఏళ్లపాటు మాకు లీజుకు ఇచ్చినట్లు వీళ్లు నకిలీ పత్రాలు సృష్టించారు.

హెచ్ఏఎల్ డైరెక్టర్ పేరుతో నకిలి లెటర్ హెడ్, సీల్

హెచ్ఏఎల్ డైరెక్టర్ పేరుతో నకిలి లెటర్ హెడ్, సీల్

హెచ్‌ఏఎల్‌ డైరెక్టర్‌ సంతకం, సీల్‌ను కూడా కాపీ చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ఈ పత్రాన్ని అందజేసి హెచ్‌ఏఎల్‌ నుంచి అధికారికంగా భూమి లీజును పొంది వ్యాపారులకు ఎర వేసి తక్కువ ధరకు వాణిజ్య అవసరాలకు భూమిని లీజుకు తీసుకున్నారని తెలిపారు. నిందితుల మాటలు నమ్మి ఇద్దరు వ్యక్తులు భూమి లీజుకు ఒప్పందం చేసుకున్నారు. వీరిలో ఒకరు నిందితులకు కోటి రూపాయలు అడ్వాన్స్ ా ఇచ్చారని పోలీసు అధికారుల విచారణలో వెలుగు చూసింది.

ప్రజలకు కుచ్చుటోపీ

ప్రజలకు కుచ్చుటోపీ

హెచ్‌ఏఎల్‌కు చెందిన భూమిని వేర్వేరు చోట్ల లీజుకు తీసుకున్నారనే సాకుతో కొందరు వ్యక్తులు హెచ్‌ఏఎల్ కంపెనీ అధికారిక లెటర్‌హెడ్‌ను ఫోర్జరీ చేసి తప్పుడు పత్రాలు సృష్టించి ప్రజలను మోసం చేస్తున్నారని ఇటీవల హెచ్‌ఏఎల్ అదనపు మేనేజింగ్ డైరెక్టర్ (సివిల్) ఎ. సురేష్‌కు సమాచారం అందింది. కేంద్ర రక్షణ శాఖ ఆధ్వర్యంలో నవరత్న రక్షణ PSDలో. దీన్ని సురేష్ సీరియస్‌గా తీసుకుని హెచ్‌ఏఎల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సురేష్ ఫిర్యాదు ఆధారంగా కేసు విచారణ చేపట్టి నిందితులను అరెస్టు చేశామని డీసీపీ ఎస్.గిరీష్ తెలిపారు.

టార్గెట్ నాన్ లోకల్

టార్గెట్ నాన్ లోకల్

నగరంలో వ్యాపారాలు ప్రారంభించేందుకు ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రతో సహా బయటి రాష్ట్రాల నుంచి వస్తున్న వ్యాపారులను నిందితులు టార్గెట్ చేసుకున్నారు. హెచ్‌ఏఎల్‌ కంపెనీకి చెందిన ఖాళీ స్థలాన్ని తమ సొంత భూమిగా చూపి డబ్బులు దండుకునేవారని పోలీసులు తెలిపారు. నిందితులు ఒక్కొక్కరికి కోటి చొప్పున హెచ్‌ఏఎల్ భూమిని లీజ్ కు తీసుకున్నట్లు పోలీసు అధికారుల విచారణలో వెలుగు చూసింది.

ఇప్పటికే సీబీఐ ఎంట్రీ ఇచ్చినా ?

ఇప్పటికే సీబీఐ ఎంట్రీ ఇచ్చినా ?

గతంలో హెచ్‌ఏఎల్ భూకబ్జాపై కూడా సీబీఐ విచారణ జరుపుతోంది. కొన్నేళ్ల క్రితం 3.5 ఎకరాల భూమిని కొందరు వ్యక్తులు ప్రైవేట్ కళాశాల ఏర్పాటుకు లీజుకు తీసుకున్నారు. హెచ్‌ఏఎల్‌కు చెందిన 833 ఎకరాల్లో లీజుకు తీసుకున్నట్లు నకిలీ పత్రం సృష్టించారు. నిందితుల ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన బ్యాంకు రికార్డులను పరిశీలిస్తున్నామని, హెచ్ ఏఎల్ భూమి లీజుకు సంబంధించి హెచ్‌ఏఎల్‌కు రూ.65 లక్షలు చెల్లించినట్లు నకిలీ పత్రాలు ఉన్నాయని గుర్తించామని, కేసు లోతుగా విచారణ చేస్తున్నామని, ఇందులో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందని అని ఆరా తీస్తున్నామని బెంగళూరులోని వైట్‌ఫీల్డ్ డివిజన్ డీసీపీ ఎస్.గిరీష్ తెలిపారు. మొత్తం మీద కేంద్ర ప్రభుత్వానికి చెందిన హెచ్ఏఎల్ భూముల మీద రియల్ ఎస్టేట్ వ్యాపారుల కన్నుపడింది అని వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+