కర్ణాటక మైండ్ బ్లాక్, తమిళనాడులో సంబరాలు, దెబ్బకు మతిపోయింది, బెంగళూరులో !
బెంగళూరు: కావేరీ జలాల (cauvery water) విషయంలో కర్ణాటకకు ఊహించని షాక్ వస్తోంది. తమిళనాడుకు (Tamil Nadu) కావేరీ నీటిని వచ్చే 15 రోజుల పాటు విడుదల చేయాలన్న సిఫార్సును సమర్థిస్తూ కావేరీ వాటర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (CWMA) శుక్రవారం కర్ణాటక ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేసింది. కర్ణాటక (Karnataka) రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా వివిధ రిజర్వాయర్లలో నీరు లేక రైతులు నానా అవస్థలు పడుతున్నారు. కావేరి రిజర్వాయర్లలోనూ ఇదే పరిస్థితి ఎదురైయ్యింది.
కర్ణాటక (Karnataka)రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో కరువు నెలకొంది. అందువల్ల ప్రభుత్వం 190కి పైగా తాలూకాలను కరువు పీడిత ప్రాంతాలుగా ఇప్పటికే ప్రకటించింది. అయితే కావేరీ నీటిని విడుదల చేయాలని కర్ణాటకను ఆదేశించిన కావేరీ వాటర్ (cauvery water) మేనేజ్‌మెంట్ కమిటీ సిఫార్సును కావేరీ వాటర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (CWMA) (సిడబ్ల్యుఎంఎ) సమర్థించింది.

కావేరి నీటిని (cauvery water) విడుదల చేయాలని సీడబ్ల్యూఏంఏ కర్ణాటకకు (Karnataka) కట్టుదిట్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో కర్ణాటకకు మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది. తమిళనాడు, కర్ణాటక వాదనలు విన్న అధికార యంత్రాంగం ఎట్టకేలకు అక్టోబర్ 16వ తేదీ నుంచి రోజుకు 3000 క్యూసెక్కుల చొప్పున మొత్తం పదిహేను రోజుల పాటు తమిళనాడుకు (Tamil Nadu) కావేరీ నీటిని విడుదల చెయ్యాలని ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కర్ణాటకకు మళ్లీ కష్టాలు ఎదురయ్యాయి.
కావేరీ వాటర్ (cauvery water) మేనేజ్‌మెంట్ కమిటీ (సీడబ్ల్యుఆర్‌సీ) తమిళనాడుకు (Tamil Nadu) వచ్చే పక్షం రోజుల పాటు నీటిని విడుదల చేయాలని ఆదేశించింది. దీంతో శుక్రవారం కూడా ఇదే అంశం అధికార యంత్రాంగం ముందుకు వచ్చింది. ఈసారి ఇక్కడ ఆర్డర్ తమిళనాడుకు (Tamil Nadu) అనుకూలంగా వచ్చింది. అయితే కర్ణాటక (Karnataka)ప్రభుత్వం కావేరి వాటర్ మేనేజ్ మెంట్ బోర్డు ముందు సమర్థవంతంగా వాదనలు వినిపించడంలో విఫలం అయ్యిందని, అందుకే ఇలాంటి సమస్యలు వస్తున్నాయని రైతు సంఘాలు, కన్నడ సంఘాలు మండిపడుతున్నాయి.












Click it and Unblock the Notifications