వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిరణ్ రిజైన్‌పై దామోదర: లగడపాటిని మెచ్చుకున్నజగన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Damodara Rajanarasimha
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇంకా ఏం చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ గురువారం అన్నారు. కిరణ్ పైన ఆయన మరోసారి ధ్వజమెత్తారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లును ప్రవేశ పెట్టగానే రాజీనామా చేస్తానని చెప్పిన కిరణ్ ఇంకా ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.

ఫైళ్లను క్లియర్ చేయడం మినహా ఆయన చేయగలిగిందేమీ లేదన్నారు. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడని కిరణ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలన్నారు. సీమాంధ్రలో మైలేజ్ కోసం పరితపిస్తున్న కిరణ్‌కు సమైక్యాంధ్ర గురించి ఎలా మాట్లాడుతారని ప్రశ్నించారు. సీమాంధ్ర ఎంపీల తీరు లోకసభలో అభ్యంతరకరమన్నారు.

రాష్ట్ర బందుకు జగన్ పిలుపు

తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టడాన్ని నిరసిస్తూ రేపు రాష్ట్ర బందుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. వైయస్ జగన్ ఢిల్లీలో ప్రకటన చేశారు. రాష్ట్ర విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం రాక్షసంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. పది సెకన్లలో తెలంగాణ బిల్లును లోకసభలో ప్రవేశ పెట్టారన్నారు. బిల్లు పెట్టేందుకు ఎవరు ఆమోదం తెలిపకపోయినా కాంగ్రెసు ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తోందన్నారు.

పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని, కాంగ్రెసు అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలను తిప్పి కొట్టేందుకు అందరు కలిసి రావాలన్నారు. బిల్లు ప్రవేశ పెట్టిన తీరుపై సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామన్నారు. విభజన బిల్లును అడ్డుకునేందుకు నిరంత ప్రయత్నాలు చేస్తున్నామని, బిల్లు ఓటింగుకు వచ్చేంత వరకు దానిని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. దీనికి అందరి సహకారం కోరుతామన్నారు. ఇలాంటి ఘటనలు మున్ముందు జరక్కుండా చూడాలన్నారు. అప్రజాస్వామిక చర్యలను అందరు ఖండించాలన్నారు.

లగడపాటికి కితాబు

విజయవాడ పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్ పెప్పర్ స్ప్రే చేసి మంచి పని చేశారని జగన్ కితాబిచ్చారు. ఎవరి ఆమోదం లేకుండా బిల్లు ప్రవేశ పెట్టినప్పుడు తమకు తోచిన విధంగా నిరసన వ్యక్తం చేయాలనుకున్నారన్నారు. లగడపాటి చేసింది మంచి పని అని, దానివల్ల ఎవరికీ హానీ జరగదన్నారు. ఆత్మరక్షణ కోసం పెప్పర్ స్ప్రేను తీసుకెళ్తున్నారని చెప్పారు. అది చల్లితే ఎలాంటి ప్రాణ నష్టం జరగదన్నారు. అన్యాయాన్ని ప్రతిఘటించేందుకు లా నిరసన వ్యక్తం చేశారని, అందులో తప్పు లేదన్నారు.

బ్లాక్ డే: అశోక్ బాబు

ఈ రోజు ఘటన బ్లాక్ డే అని ఎపిఎన్జీవో అధ్యక్షులు అశోక్ బాబు అన్నారు. ఆర్టికల్ 3తో ఏ రాష్ట్రాన్నైనా విభజించవచ్చునని, సీమాంధ్ర ఎంపీలపై దాడి దుర్మార్గమైన చర్య అన్నారు.

English summary
Deputy Chief Minister Damodara Rajanarasimha on Thursday questioned Chief Minister Kiran Kumar Reddy about his resignation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X