వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆటో డ్రైవర్ కూతురు.. జడ్జిగా ఎంపికైంది! పైగా స్టేట్ టాపర్ కూడా...

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

డెహ్రాడూన్: ఓ ఆటో డ్రైవర్ కూతురు ఎట్టకేలకు తాను అనుకున్నది సాధించింది. జడ్జి అయి తన పట్టుదలను చాటుకుంది. ఇటీవల వెల్లడించిన ఉత్తరఖండ్ ప్రొవిజనల్ సివిల్ సర్వీసెస్ (జ్యూడిషియల్) - 2016 ఫలితాల్లో పూనమ్ తోడి స్టేట్ టాపర్‌గా నిలిచారు.

గతంలో రెండుసార్లు ఈ పరీక్ష రాసినప్పటికీ.. పూనమ్ ఇంటర్వ్యూ రౌండ్‌ను కూడా అధిగమించలేకపోయారు. రెండుసార్లు ఓటమి నిరాశపరిచినప్పటికీ ఆమె ఏ మాత్రం కుంగిపోలేదు. మూడోసారి మరింతగా శ్రమించి ఏకంగా స్టేట్ టాపర్‌గా నిలిచారు.

ఆమె తండ్రి అశోక్ తోడి ఆటో నడుపుతూ రోజు అతి కష్టం మీద రూ. 500 వరకు సంపాదిస్తాడు. కానీ అమ్మాయి, అబ్బాయి అనే తారతమ్యం చూపకుండా ఆడపిల్లల్ని కూడా చదివించాడు. పిల్లలకు మంచి భవిష్యత్తు అందించాలనే లక్ష్యంతో.. సొంత అవసరాలను సైతం ఆయన పక్కన పెట్టేవారు.

పూనమ్ తండ్రి గతంలో తెహ్రీలో ఓ చిన్న దుకాణం నడిపేవారు. కానీ ఆదాయం సరిపోకపోవడంతో డెహ్రాడూన్ వలస వచ్చారు. అక్కడా ఓ దుకాణం ప్రారంభించినప్పటికీ.. లాభసాటిగా లేకపోవడంతో ఆటో నడపడం మొదపెట్టాడు. వచ్చే కొద్దిపాటి ఆదాయంతోనే పిల్లలను ఉన్నత చదువులు చదివించారు.

తండ్రి ఆదాయం అంతంతమాత్రమే అయినా... కుటుంబ పోషణ భారంగా మారినా.. ఏనాడూ ఉద్యోగంలో చేరమని తల్లిదండ్రులు తనను బలవంతం చేయలేదని పూనమ్ తోడి తెలిపింది. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతోనే ఎంకామ్‌, న్యాయ విద్యను పూర్తి చేశానని ఆమె పేర్కొంది.

ఇక కూతురు సాధించిన విజయం పట్ల ఆమె తండ్రి అశోక్ ఎంతగానో మురిసిపోతున్నాడు. పూనమ్‌కు ముగ్గురు తోబుట్టువులు ఉన్నారు అక్కకు పెళ్లి కాగా, అన్నయ్య ప్రయివేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. తమ్ముడు చదువుకుంటున్నాడు.

English summary
Poonam Todi, daughter of an autorickshaw driver has finally realised her dream of becoming a judge. In the results of the entrance exam of the Uttarakhand Provincial Civil Services (Judicial) 2016, which were declared on Wednesday, Todi emerged as the state topper. While speaking, she credited her family's "rock solid support" behind her success. "My parents never pressured me to join a job to supplement the family's income. Instead they always encouraged me to study further, which is why I was able to complete my MCom as well as law degrees," she said. Incidentally, she had appeared for the exam twice earlier as well but could not make it beyond the interview round. However, by not letting the failure stall her, she says she tried again “with renewed vigour and a sturdy determination to achieve my goal.”
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X