Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Daughter: ఊర్లో ప్రియుడు, పక్కఊర్లో కాబోయే మొగుడు, కూతురి గొంతు చీల్చి చంపేసిన తండ్రి, తల్లి చూసి !

పాట్నా: ఒకే ఊరిలో ఉంటున్న యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. రెండు సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్న యువతి, యువకుడు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అమ్మాయి కంటే అబ్బాయిది తక్కువ జాతి అని ముందు నుంచి తెలిసిన ఆమె కుటుంబ సభ్యులు రగిలిపోయారు. పెద్దల పంచాయితీలు చేసి, వార్నింగ్ ఇవ్వడం ఇప్పటికే జరిగిపోయాయి. నేను కచ్చితంగా ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటానని అమ్మాయి తేల్చి చెప్పింది. కొన్ని నెలల నుంచి అమ్మాయి తండ్రితో పాటు అతని సోదరులు అమ్మాయిని పట్టుకుని చితకబాదుతున్నారు. వేరు యువకుడితో అమ్మాయి పెళ్లి ఫిక్స్ చేశారు. నేను కచ్చితంగా నా ప్రియుడిని పెళ్లి చేసుకుంటానని, నువ్వు చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకోనని అమ్మాయి మరోసారి తేల్చిచెప్పింది. ఇదే విషయంలో ఇంట్లో రచ్చరచ్చ అయ్యింది. సోదరులతో కలిసి ప్రేమించిన ప్రియుడిని పెళ్లి చేసుకోవడానికి సిద్దం అయిన కన్నకూతురిని ఆమె తండ్రి ఆమె గొంతు చీల్చి దారుణంగా హత్య చెయ్యడం కలకలం రేపింది. నా భర్త, ఇద్దరు మరుదులు కలిసి తన కూతురిని చంపేశారని (పరువు హత్య) బాధితురాలి తల్లి కేసు పెట్టడం హాట్ టాపిక్ అయ్యింది.

ఒక్కటే కూతురు

ఒక్కటే కూతురు

బీహార్ లోని గోపాల్ గంజ్ ప్రాంతంలోని మసాన్ ప్రాంతంలో ఇంద్రదేవ్, కళావతి దేవి దంపతులు నివాసం ఉంటున్నారు. ఇంద్రదేవ్, కళావతి దంపతులకు కిరణా దేవి అలియాస్ దేవి (19) అనే కుమార్తె ఉంది. ఒక్కటే కూతురు కావడంతో కిరణాదేవిని ఆమె తల్లిదండ్రులు ఇంద్రదేవ్, కళావతి దేవి చాలా ముద్దుగా పెంచుకుంటూ వచ్చారు.

ప్రేమలో పడిన కూతురు

ప్రేమలో పడిన కూతురు

కిరణా దేవి నివాసం ఉంటున్న ఏరియాలోనే నివాసం ఉంటున్న రాకేష్ అనే యువకుడిని ప్రేమించింది. రెండు సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్న కిరణా దేవి, రాకేష్ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ప్రేమికులు కిరణా దేవి, రాకేష్ ఇంతకాలం స్నేహితుల సహాయంతో చాలా సీక్రేట్ గా కలుసుకుంటూ మాట్లాడుకుంటున్నారు.

తక్కువ కులం అని రగిలిపోయిన తండ్రి

తక్కువ కులం అని రగిలిపోయిన తండ్రి

ప్రియురాలు కిరణా దేవి కంటే ఆమె ప్రియుడు రాకేష్ ది తక్కువ జాతి అని ముందు నుంచి తెలిసిన ఆమె తండ్రి ఇంద్రదేవ్ ఇద్దరిని ప్రేమను వ్యతిరేకించాడు. అయితే కూతురు కిరణా దేవి చెప్పిన మాట వినడం లేదని ఇంద్రదేవ్ రగిలిపోయారు. ఇప్పటికే ఊరి పెద్దల పంచాయితీలు చేసి ప్రియుడు రాకేష్ కు కొన్నిసార్లు వార్నింగ్ లు ఇవ్వడం జరిగిపోయాయి.

నా ప్రియుడినే పెళ్లి చేసుకుంటా

నా ప్రియుడినే పెళ్లి చేసుకుంటా

నేను కచ్చితంగా ప్రేమించిన అబ్బాయి రాకేష్ ను పెళ్లి చేసుకుంటానని కిరణా దేవి ఆమె ఇంట్లో తేల్చి చెప్పింది. కొన్ని నెలల నుంచి అమ్మాయి తండ్రి ఇంద్రదేవ్ తో పాటు అతని సోదరులు కిరణా దేవిని పట్టుకుని చితకబాదుతున్నారు. బీర్జా గ్రామంలో నివాసం ఉంటున్న సాతీ శర్మా అనే యువకుడితో ఇంద్రదేవ్ అతని కూతురు కిరణా దేవి పెళ్లి ఫిక్స్ చేశాడు.

కన్న కూతురి గొంతు చీల్చి చంపేసిన తండ్రి, సోదరులు

కన్న కూతురి గొంతు చీల్చి చంపేసిన తండ్రి, సోదరులు

నేను కచ్చితంగా నా ప్రియుడిని పెళ్లి చేసుకుంటానని, నువ్వు చూసిన శర్మాను పెళ్లి చేసుకోనని కిరణా దేవి మరోసారి తేల్చిచెప్పింది. ఇదే విషయంలో ఇంద్రదేవ్ అతని ఇంట్లో రచ్చరచ్చ చేశాడు. ఇద్దరు సోదరులతో కలిసి ప్రేమించిన ప్రియుడిని పెళ్లి చేసుకోవడానికి సిద్దం అయిన కన్నకూతురు కిరణా దేవిని ఆమె తండ్రి ఇంద్రదేవ్ ఆమె గొంతు చీల్చి దారుణంగా హత్య చెయ్యడం కలకలం రేపింది.

భర్త మీద కేసు పెట్టిన భార్య

భర్త మీద కేసు పెట్టిన భార్య

నా భర్త ఇంద్రదేవ్, ఇద్దరు మరుదులు కలిసి తన కూతురు కిరణా దేవిని పరువు హత్య చేశారని బాధితురాలి తల్లి కళావతి దేవి కేసు పెట్టిందని పోలీసు అధికారి సంజీవ్ కుమార్ మీడియాకు చెప్పారు. ప్రేమించిన రాకేష్ ను పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిన కిరణా దేవిని హత్య చేసిన ఇంద్రదేవ్, అతని ఇద్దరు తమ్ముళ్లు పరారైనరాని, వారి కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారి సంజీవ్ కుమార్ స్థానిక మీడియాకు చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+