చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇంత దారుణమా?: 'శవాల' దందా.. చెన్నై వృద్ధాశ్రమంలో దిగ్భ్రాంతికర విషయాలు..

|
Google Oneindia TeluguNews

చెన్నై: ధనార్జన కోసం అత్యంత నీచానికి దిగజారిన వైనమిది. శవాల మీద పేలాలు ఏరుకోవడం కన్నా దారుణమనే చెప్పాలి. వృద్ధాశ్రమం ముసుగులో శవాలతో చేస్తున్న ఈ దందా చెన్నైలో వెలుగుచూసింది. ఏ తోడూ లేని ఒంటరి వృద్ధులు వేళకు ఇంత తిని నీడ పట్టున ఉండవచ్చని ఆశ్రమానికొస్తే.. ఇక్కడ పరిస్థితి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంది. వృద్ధులను సంరక్షించడం సంగతి పక్కనపెడితే.. వారి ప్రాణాలకే ముప్పు వచ్చే పరిస్థితి ఏర్పడింది.

వృద్ధాశ్రమంపై అనుమానాలు..:

వృద్ధాశ్రమంపై అనుమానాలు..:

కాంచీపురంలోని పాలేశ్వరం గ్రామంలో విదేశీ స్వచ్చంద సంస్థల నిధులతో సెయింట్‌ జోసెఫ్‌ కరుణైఇల్లమ్‌ అనే ఒక వృద్ధాశ్రమాన్ని నిర్వహిస్తున్నారు. అయితే వృద్ధాశ్రమ నిర్వహణపై అనేక అనుమానాలు, ఆరోపణలు, ఫిర్యాదులు ఉండటం గమనార్హం. వృద్ధాశ్రమం లోపల శవాల మాఫియా నడుస్తోందన్న ఆరోపణలు ప్రధానంగా వినిపిస్తున్నాయి.

ఇలా వెలుగులోకి:

ఇలా వెలుగులోకి:

చెన్నైలోని తాంబరం వృద్ధాశ్రమానికి చెందిన విజయకుమార్‌ (75) రెండు రోజుల క్రితం ప్రభుత్వాసుపత్రిలో మృతి చెందాడు.

అయితే అతని మృతదేహాన్ని తరలించడానికి పాలేశ్వరం వృద్ధాశ్రమానికి చెందిన ఒక వ్యాన్ రావడం గమనార్హం. మృతదేహాన్ని తరలిస్తుండగా.. మార్గమధ్యలో తిరుముక్కూడల్‌ రహదారి వద్ద వ్యాన్ లోపలి నుంచి 'కాపాడండి.. కాపాడండి' అని బిగ్గరగా కేకలు వేయడం స్థానికులకు వినిపించింది.

 గుట్టు రట్టయింది..:

గుట్టు రట్టయింది..:


కేకలతో అప్రమత్తమైన స్థానికులు.. ఆ వ్యాన్ కు అడ్డం తిరిగి ఆపారు. వ్యాన్ తలుపులు తెరిచి చూడగా.. అందులో కూరగాయాలతో పాటు విజయ్ కుమార్ అనే వృద్ధుడి మృతదేహాన్ని, అలాగే సెల్వరాజ్‌, అన్నమ్మాళ్‌లు అనే వృద్ధ దంపతులను తరలిస్తున్నట్టు గుర్తించారు.

ఆరా తీయగా.. తమను కిడ్నాప్ చేసి పాలేశ్వరం ఆశ్రమానికి తరలిస్తున్నారని, అక్కడికి పోతే ప్రాణాలు పోతాయని వారు వాపోయారు. ఆపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.

 నెలకు 40శవాలు..:

నెలకు 40శవాలు..:

కరుణైఇల్లం ఆశ్రమంలో నెలకు 40మంది వృద్ధులు చనిపోతున్నట్టు అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది. ఒక్క నెలలో ఇంతమంది చనిపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

ఈ నేపథ్యంలో అధికారులు ఆశ్రమంపై దాడులు జరపగా.. విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. శ్రమంలో మృతిచెందిన వృద్ధుల ఎముకలతో పెద్ద దందా నడుపుతున్నారని వెల్లడైంది. వృద్ధులు మృతి చెందితే.. వారి మృతదేహాలను దేహాలను స్మశానానికి తరలించడం లేదని గుర్తించారు.

ఎముకల దందా..:

ఎముకల దందా..:

మృతదేహాలను శ్మశానాలకు తరలించకుండా.. వాటి నుంచి ఎముకలు సేకరించేందుకు ఆశ్రమం వెనుకాల ఓ ప్రత్యేక ఏర్పాటు చేసినట్టు గుర్తించారు. ఆశ్రమం వెనుక 20 అడుగుల పొడవు, 40 అడుగుల వెడల్పు కలిగిన ఒక తొట్టె లాంటి గదిలో మృతదేహాలను పేర్చుతున్నారు.

శవాలు బాగా కుళ్లిపోయాక.. అవయవాలన్నీ మాంసపు ముద్దలుగా ఆ గోతిలో పడిపోతాయి. ఆ తర్వాత అక్కడ మిగిలే అస్తిపంజరాలను వీరు విదేశాలకు ఎగుమతి చేస్తున్నట్టు గుర్తించారు.

English summary
Shocking facts are revealed in a oldage home in Chennai. According to the reports they are exporting dead bodies bones to foreign countries
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X