జుహు బీచ్‌కు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం(ఫొటో)
ముంబై: మహారాష్ట్రలోని ముంబైలో గురువారం రాత్రి జుహు తీరానికి 30 అడుగుల తిమింగలం కొట్టుకొచ్చింది. రాత్రి 10గంటల ప్రాంతంలో తిమింగలాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
అధికారులు సముద్ర తీరానికి చేరుకొని తిమింగలం ఎలా చనిపోయిందో పరిశీలిస్తున్నారు. కాగా, ఆ తిమింగలాన్ని చూసేందుకు భారీగా ప్రజలు అక్కడికి చేరుకుంటున్నారు.

ఇటీవల తమిళనాడులోని ట్యుటీకోరిన్ జిల్లాలో తిరుచందూర్ వద్ద సముద్ర తీరానికి దాదాపు వంద తిమింగలాలు కొట్టుకొచ్చిన విషయం తెలిసిందే. వాటిలో చాలా వరకు మరణించాయి.
30 feet Whale on juhu beach .. What's happening in Mumbai ??? pic.twitter.com/0KBzND1zbB
— Sameera Gawandi (@sameeratweeter) January 29, 2016 











Click it and Unblock the Notifications