• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Amarnath Floods: 15కి చేరిన మృతులు, హెల్ప్‌లైన్ నెంబర్స్ ఇవే, యాత్రలోనే రాజాసింగ్

|
Google Oneindia TeluguNews

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లోని అమర్నాథ్‌లో భారీ వర్షాలు, ఆకస్మిక వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య 15కు పెరిగింది. అమర్నాథ్ గుహ దిగువ ప్రాంతంలో సంభవించిన ఆకస్మిక వరదల నేపథ్యంలో ప్రభుత్వం శుక్రవారం అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్‌లను జారీ చేసింది. ఆకస్మిక వరదల కారణంగా అనేక టెంట్లు కొట్టుకుపోవడంతో 15 మందికి పైగా యాత్రికులు మరణించారు.

దాదాపు 40 మందికిపైగా వరదల్లో కొట్టుకుపోయారని జమ్మూకాశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్‌ని సంప్రదించడానికి హెల్ప్‌లైన్ నంబర్‌లు 011-23438252 మరియు 011-23438253. కాశ్మీర్ డివిజనల్ హెల్ప్‌లైన్, పుణ్యక్షేత్రం బోర్డు హెల్ప్‌లైన్‌లను సంప్రదించడానికి, నంబర్‌లు వరుసగా 0194-2496240, 0194-2313149.

ఆకస్మిక వరదల్లో కనీసం మూడు లంగర్లు (కమ్యూనిటీ కిచెన్‌లు), 25 యాత్రి టెంట్లు కొట్టుకుపోయాయి. సహాయక చర్యల కోసం ఎన్‌డిఆర్‌ఎఫ్‌, ఎస్‌డిఆర్‌ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగాయి. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురియడంతో గుహపై నుంచి, పక్కల నుంచి నీరు వచ్చి చేరిందని ఐటీబీపీ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు.

కాగా, పరిస్థితి సాధారణ స్థితికి వచ్చే వరకు అమర్‌నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఐటీబీపీ పీఆర్వో వివేక్ కుమార్ పాండే ఏఎన్‌ఐకి తెలిపారు.

"పరిస్థితి అదుపులో ఉంది, వర్షాలు ఇంకా కొనసాగుతున్నాయి. ప్రమాద స్థాయిని పరిశీలిస్తే, ఆ ప్రాంతం ముంపునకు గురికావడంతో అమర్‌నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. వాతావరణం సాధారణంగా ఉండి, తాత్కాలిక ఏర్పాట్లు చేస్తే, శనివారం యాత్రను తిరిగి ప్రారంభించవచ్చు' అని వివేక్ కుమార్ పాండే అన్నారు.

జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా మాట్లాడుతూ.. పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు, యాత్రికులకు అవసరమైన సహాయం అందించడానికి సంబంధిత వారందరికీ సూచించినట్లు చెప్పారు.

 Deaths toll to 15 in Amarnath Flash Floods: Emergency Helpline Numbers Issued, Yatra Suspended For Now, PM expressed anguish

త్వరితగతిన సహాయక చర్యలు చేపట్టాలని కేంద్ర బలగాలను, జమ్మూకశ్మీర్‌ అధికార యంత్రాంగాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఆదేశించారు.

"ఎన్‌డిఆర్‌ఎఫ్, సిఆర్‌పిఎఫ్, బిఎస్‌ఎఫ్, స్థానిక పరిపాలన సహాయక చర్యలో నిమగ్నమై ఉన్నాయి. ప్రజల ప్రాణాలను రక్షించడం మా ప్రాధాన్యత. భక్తులందరూ క్షేమంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నా" అని అమిత్ షా ట్వీట్ చేశారు.

వరద ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

"శ్రీ అమర్‌నాథ్ గుహ సమీపంలో భారీ వర్షం, వరదలతో పలువురు మృతి చెందడం బాధాకరం. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నా. ఎల్‌జీ మనోజ్ సిన్హాతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించాను. రెస్క్యూ, రిలీఫ్ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. బాధితులకు అన్ని విధాలుగా సహాయం అందిస్తున్నాము' అని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.

అమర్నాథ్ యాత్రలో ఎమ్మెల్యే రాజా సింగ్ తోపాటు తెలుగు యాత్రికులు

అమర్నాథ్ యాత్రలో ఎమ్మెల్యే రాజాసింగ్ కుటుంబసభ్యులతో కలిసి వెళ్లారు. అమర్నాథుడి దర్శనం అనంతరం తిరుగుపయనమయ్యే సమయానికి భారీ వర్షం, వరదలు ఒక్కసారిగా వచ్చాయని ఆయన ఓ మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. అయితే, తామంతా సురక్షితంగా ఉన్నామన్నారు. వరదలతో పలు టెంట్లు కొట్టుకుపోయాయని, 40 మంది వరకు వరదల్లో కొట్టుకుపోయారని చెప్పారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. నీరు, ఆహారానికి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు. విద్యుత్ సరఫరా తాత్కాలికంగా నిలిచిందని చెప్పారు. మరోవైపు, తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా యాత్రలో ఉన్నట్లు సమాచారం. తెలంగాణ, ఏపీకి చెందిన 100 మందికిపైగా యాత్రికులు అమర్నాథ్ లోనే ఉన్నట్లు సమాచారం.

English summary
Deaths toll to 15 in Amarnath Flash Floods: Emergency Helpline Numbers Issued, Yatra Suspended For Now, PM expressed anguish.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X