మీడియాకు వార్నింగ్ ఇచ్చిన డీకే బ్రదర్: పరువునష్టం కేసులు పెట్టి, ఏం అనుకుంటున్నారు ?
కర్ణాటక విద్యుత్ శాఖ మంత్రి డీకే. శివకుమార్ కు విరుద్దంగా వార్తలు ప్రసారం చేసినా, దినపత్రికల్లో కథనాలు ప్రచురించినా అలాంటి మీడియా మీద పరువునష్టం దావా వేసి కోర్టుకు ఈడ్చుతామని ఆయన సోదరుడు డీకే.
బెంగళూరు: కర్ణాటక విద్యుత్ శాఖ మంత్రి డీకే. శివకుమార్ కు విరుద్దంగా వార్తలు ప్రసారం చేసినా, దినపత్రికల్లో కథనాలు ప్రచురించినా అలాంటి మీడియా మీద పరువునష్టం దావా వేసి కోర్టుకు ఈడ్చుతామని ఆయన సోదరుడు డీకే. సురేష్ శుక్రవారం వార్నింగ్ ఇచ్చారు.
బెంగళూరు గ్రామీణ జిల్లా లోక్ సభ నియోజకవ వర్గం ఎంపీ (కాంగ్రెస్) డీకే. సురేష్ శుక్రవారం బెంగళూరులోని సదాశివనగర్ లోని తన సోదరుడు, మంత్రి డీకే. శివకుమార్ ను కలుసుకోవడానికి ప్రయత్నించారు. అయితే ఆదాయపన్ను శాఖ అధికారులు అందుకు అవకాశం ఇవ్వలేదు.

ఈ సందర్బంగా డీకే. శివకుమార్ ఇంటి బయట ఎంపీ డికే. సురేష్ మీడియాతో మాట్లాడారు. మాకు పార్టీ కార్యకర్తల అండ ఉందని, బీజేపీ నాయకులు ఎాన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా మమల్ని ఏమీ చెయ్యలేరని బీజేపీ పార్టీ నాయకుల మీద మండిపడ్డారు. రాజకీయ కక్షతోనే ఆదాయపన్ను శాఖతో దాడులు చేయించారని ఆరోపించారు.
ఆదాయపన్ను శాఖ దాడులు మొదలు పెట్టిన తరువాత డీకే. శివకుమార్ పరువు, ప్రతిష్ట దెబ్బ తియ్యడానికి కొన్ని మీడియా సంస్థలు ప్రయత్నిస్తున్నాయని, అలాంటి వారి మీద పరువునష్టం దావా వేస్తామని డీకే. సురేష్ హెచ్చరించారు. ఇప్పటి వరకూ ఆదాయపన్ను శాఖ అధికారులు ఎలాంటి వివరాలు బయటకు చెప్పకున్నా మీడియా మాత్రం ఇష్టం వచ్చినట్లు వార్తలు ప్రసారం చేస్తున్నాయని, అలాంటి వారిని విడిచిపెట్టమని వార్నింగ్ ఇచ్చారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications