ఉదయాన్నే ఉలిక్కిపడ్డ ఢిల్లీ: పరుగులు తీసిన జనం!
ఉత్తర భారతంలో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దేశ రాజధాని ఢిల్లీతో పాటు పొరుగు రాష్ట్రమైన హర్యానాలు సోమవారం ఉదయం భూప్రకంపనలు సంభవించాయి. దీనివల్ల ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అప్పుడే నిద్రలేస్తున్న ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడి రోడ్ల మీదకు పరుగులు తీశారు.
సోమవారం (జనవరి 19, 2026) ఉదయం 8:44 గంటలకు భూమి కంపించింది. హర్యానాలోని సోనిపట్ జిల్లాలో ఈ ప్రభావం ఎక్కువగా కనిపించింది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ అందించిన వివరాల ప్రకారం.. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 2.8గా నమోదైంది. ఉత్తర ఢిల్లీ ప్రాంతంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. భూమి లోపల సుమారు 5 కిలోమీటర్ల లోతులో ఈ ప్రకంపనలు మొదలయ్యాయి.

భయాందోళనలో ప్రజలు
భూకంప తీవ్రత తక్కువగానే ఉన్నప్పటికీ, సోనిపట్, ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఇళ్లలోని కిటికీలు, తలుపులు, ఇతర వస్తువులు గట్టిగా కదిలాయి. దీంతో ఆందోళనకు గురైన జనం తమ ఇళ్లు, కార్యాలయాల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. అయితే ఈ స్వల్ప భూకంపం కారణంగా ఇప్పటివరకు ఎటువంటి ప్రాణ లేదా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం అందలేదు. ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతం భూకంప జోన్-4లో ఉన్నందున, ఇలాంటి స్వల్ప ప్రకంపనలు తరచుగా సంభవిస్తూనే ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications