భార్యకు కేజ్రీవాల్ ఆలింగనం: థ్యాంక్యూ సునీత అంటూ ట్వీట్
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎన్నికల్లో ప్రజల బ్రహ్మరథం పట్టడంతో ఆమ్ ఆద్మీ పార్టీ చీప్ అరవింద్ కేజ్రీవాల్ ఉబ్బితబ్బైనట్లే కనిపిస్తున్నారు. ఎప్పుడూ రాని కేజ్రీవాల్ సతీమణి సునీత మంగళవారంనాడు ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయానికి వచ్చారు. గత 20 ఏళ్లుగా తనతో కాపురం చేస్తున్న భార్య సునీతను కేజ్రీవాల్ కౌగలించుకున్నారు.
విజయోత్సవాలకు సంబంధించిన ఫొటోలను ఆయన ట్విట్టర్‌లో పెట్టాడు. అప్పటికే ఆయన ఢిల్లీ ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు. పశ్చిమ ఢిల్లీలోని పటేల్ నగర్‌లో గల మూడంతస్థుల భవనం బాల్కనీ నుంచి దర్శనమిస్తూ ఆయన ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు. ఆయన పక్కన భార్య సునీత కూడా ఉన్నారు. ఆరెంజ్ సల్వార్ కమీజ్ ధరించి ఆమె భర్త పక్కన నించున్నారు.

గులాబీ రేకులు పైనుంచి కురుస్తుండగా, కేజ్రీవాల్ - ఢిల్లీ ప్రజలకు సెల్యూట్, వారు అద్భుతాన్ని సాధించారు అని అన్నారు. అదే సమయంలో సునీత వీ సంకేతంతో విక్టరీ సంకేతం ఇచ్చారు. ఈమె నా భార్య అంటూ ఆమె భుజాలపై తన చేతులను ఉంచుతూ కేజ్రీవాల్ సునీతను ప్రజలకు పరిచయం చేశారు. సునీత చేతులు జోడించి నవ్వుతూ కనిపించారు.
ఆమెను తాను ఈరోజు ఇక్కడికి లాక్కొచ్చానని, ప్రభుత్వం ఏ విధమైన చర్య కూడా తీసుకోదని ఆయన అన్నారు. ఆమె లేకుండా తాను ఏదీ సాధించలేకపోయేవాడినని కేజ్రీవాల్ సునీతకు కితాబు ఇచ్చారు. ఒంటరిగా తానేమీ చేయలేనని, తాను చాలా చిన్నవాడినని ఆయన అన్నారు.
Thank u Sunita for always being there "@rsaraf007: Sunita Kejriwal and @ArvindKejriwal first pics after winning pic.twitter.com/eDLxfxKMbd"
— Arvind Kejriwal (@ArvindKejriwal) February 10, 2015 -
కేంద్రానికి కవిత షాకింగ్ అల్టిమేటం.. ఆ విషయంలో పోరాటమే! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..












Click it and Unblock the Notifications