అలర్ట్.. అలర్ట్... మరో 48 గంటలు ఢిల్లీలో హై అలర్ట్.. ఐబీ హెచ్చరికలతో భద్రతా సంస్థలు అప్రమత్తం..
మరో 48 గంటల్లో జమ్ముకశ్మీర్ రెండు కేంద్రప్రాంత పాలిత ప్రాంతాలుగా విడిపోనుంది. జమ్ముకశ్మీర్ విభజన బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలుపగా.. గెజిట్ కూడా వెలువడిన సంగతి తెలిసిందే. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఈ నెల 31వ తేదీన జమ్ముకశ్మీర్ కేంద్రప్రాంత పాలిత ప్రాంతాలుగా విడిపోనుంది. కశ్మీర్ విభజనను వ్యతిరేకిస్తున్న పాకిస్థాన్, ఉగ్రవాదులు దాడులకు తెగబడే అవకాశం ఉందని నిఘావర్గాలు హెచ్చరిస్తున్నాయి.

31వ తేదీన విభజన..
31వ తేదీన జమ్ముకశ్మీర్.. కశ్మీర్, లడాఖ్ కేంద్రప్రాంత పాలిత ప్రాంతాలుగా విడిపోనుంది. కశ్మీర్ విభజనను వ్యతిరేకిస్తున్న ముష్కరులు దాడులకు తెగబడే అవకాశం ఉంది. ఈ మేరకు నిఘావర్గాలు హెచ్చరికలు జారీచేశాయి. దేశ రాజధాని ఢిల్లీ లక్ష్యంగా దాడులు చేసే ఛాన్స్ ఉందని హెచ్చరించడంతో మరో 48 గంటలు హై అలర్ట్ విధించారు. రాజధాని ప్రాంతాన్ని పోలీసులు ఇప్పటికే జల్లెడపట్టారు. అణువణువూ పరిశీలిస్తున్నారు.

హిట్‌లిస్ట్‌లో ఢిల్లీ
ఉగ్రవాదుల హిట్ లిస్టులో ఢిల్లీ ఎప్పటినుంచో ఉంది. కశ్మీర్ విభజనను వ్యతిరేకిస్తున్న కొందరు దాడులకు తెగబడే ప్రయత్నం చేస్తారని విశ్వసనీయంగా తెలిసింది. ఐబీ.. భద్రతా విభాగాలను అలర్ట్ చేశాయి. దీంతో పోలీసులు దేశ రాజధానిని జల్లెడ పడుతున్నారు. ఎక్కడ ఏ చిన్న అనుమానం వచ్చిన.. తనిఖీ చేస్తున్నారు. కశ్మీర్ విభజన తర్వాత ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే. కశ్మీర్‌లోనే దాదాపు 40 వేలకు పైగా సీఆర్పీఎఫ్ బలగాలను మొహరించారు. ఇప్పటికీ కూడా ఆంక్షలు అమల్లో ఉండటంతో జనం బయటకు రాని పరిస్థితి ఏర్పడింది.

కారణమిదీ..?
కశ్మీర్ విభజనను నిరసిస్తూ ఢిల్లీ లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులు చేయొచ్చని నిఘావర్గాలు హెచ్చరించాయి. మారుతున్న పరిణామాలతో సోమవారం ఢిల్లీలో హై లెవల్ మీటింగ్ జరిగింది. అన్ని భద్రతా సంస్థలను ఐబీ హెచ్చరించిన సంగతి తెలిసిందే. దీంతో 31వ తేదీన బీభత్సం సృష్టించే అవకాశం ఉందని భావించి అప్రమత్తం చేసింది.

విలీనం
ఆర్టికల్ 370 రద్దుచేసి.. జమ్ముకశ్మీర్‌ను నరేంద్ర మోడీ ప్రభుత్వం విభజించిన సంగతి తెలిసిందే. ఆగస్ట్ 5వ తేదీని కశ్మీర్ విభజన ప్రక్రియ పూర్తయింది. గెజిట్ విడుదలైన.. జమ్ముకశ్మీర్, లడాఖ్ కేంద్రప్రాంత పాలిత రాష్ట్రాలుగా ఈ నెల 31వ తేదీ నుంచి మనుగడలోకి వస్తాయి. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా గురువారాన్ని కేంద్ర నిర్ణయించింది. అఖండ భారతంలో ఉన్న సంస్థానాలను పటేల్ విలీనం చేసిన సంగతి తెలిసిందే. ఆయన సేవలకు గుర్తుగా పటేల్ జయంతి సందర్భంగా కశ్మీర్, లడాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు అమల్లోకి రానున్నాయి.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర!












Click it and Unblock the Notifications