దేశ రాజధాని దిల్లీలో హై అలర్ట్.. కారణం ఇదే..?

దిల్లీలో ఐఈడీ (Improvised Explosive Device) దాడుల అవకాశం ఉందని నిఘా సంస్థల హెచ్చరికల నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే ఉగ్రవాద ముఠాలను ఇటీవల భగ్నం చేసిన తర్వాత ఈ అప్రమత్తత మరింత పెరిగింది. పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. మీడియా కథనాల ప్రకారం.. ఉగ్రవాదులు దిల్లీలోని కీలక ప్రదేశాలను, ముఖ్యంగా సున్నిత, రద్దీ ప్రదేశాలను ఐఈడీలతో లక్ష్యంగా చేసుకోవచ్చని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో దిల్లీ పోలీసులు భద్రతను పెంచి, నగరమంతటా విస్తృత తనిఖీలు చేపట్టారు.

బీజేపీ రాష్ట్ర, జాతీయ కార్యాలయాల వద్ద పోలీసులు అదనపు బారికేడ్లు ఏర్పాటు చేసి, తనిఖీలు ముమ్మరం చేశారు. అంతేకాదు, కీలక ప్రాంతాల్లో మోహరించిన భద్రతా బలగాలు కూడా ఉగ్రవాదుల లక్ష్యాలుగా మారే అవకాశం ఉందని వర్గాలు హెచ్చరించాయి. దిల్లీ పోలీసుల స్పెషల్ సెల్, పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ ఆదేశాల మేరకు పనిచేస్తున్న పాక్ గ్యాంగ్‌స్టర్-ఉగ్రవాది షాజాద్ భట్టీకి చెందిన ముఠాను కొద్ది వారాల క్రితం భగ్నం చేసింది. ఈ కేసులో తొమ్మిది మందిని అరెస్టు చేశారు.

విచారణలో, ముఠా ఢిల్లీలో లక్ష్యిత హత్యలకు కుట్ర చేసిందని, ఒక ప్రముఖ దేవాలయంతో సహా పలు ముఖ్య ప్రాంతాలపై రెక్కీ నిర్వహించి వీడియోలను సూత్రధారులకు పంపిందని వెల్లడైంది. దేవాలయ ప్రాంగణంలోని పోలీసు, పారామిలటరీ సిబ్బందిపై కాల్పులు జరిపి భయాందోళనలు సృష్టించేందుకు ప్రణాళికలు రూపొందించారు. దిల్లీ-సోనిపత్ రహదారి వెంబడి ఉన్న రద్దీగా ఉండే ఓ ప్రసిద్ధ ధాభాపై గ్రనేడ్ దాడి చేసి, భారీ నష్టం, ప్రాణనష్టం కలిగించాలని ముఠా ప్రణాళిక వేసిందని మరో వర్గం తెలిపింది. దిల్లీతో పాటు ఇతర ప్రాంతాలనూ ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారు.

Delhi on High Alert Security Beefed Up Following Intelligence Warnings of IED Attacks Delhi alert

గతేడాది ఎర్రకోట వద్ద జరిగిన ప్రాణాంతక కారు పేలుడు (నవంబర్ 10) తర్వాత, జైష్-ఎ-మొహమ్మద్‌కు చెందిన "వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్"ను పోలీసులు భగ్నం చేశారు. 15 మంది మరణించి, పలువురు గాయపడిన ఈ ఘటనలో, హర్యానా అల్ ఫలా యూనివర్సిటీకి చెందిన తీవ్రవాద భావాలున్న వైద్యులు భాగమయ్యారు. ఆత్మాహుతి దాడికి పాల్పడనున్న ఉగ్రవాది డాక్టర్ ఉమర్ ఉన్ నబీకి మద్దతు ఇచ్చిన ఆరోపణలపై సీనియర్ వైద్యులు, కళాశాల విద్యార్థులు, పరిపాలనా అధికారులను అరెస్టు చేశారు. అల్ ఫలా యూనివర్సిటీకి చెందిన ముగ్గురు వైద్యులు సహా 8 మందిని అరెస్టు చేసి, 2,900 కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్న కొన్ని గంటల తర్వాత, పేలుడు పదార్థాలున్న ఐ20 కారుతో డాక్టర్ ఉమర్ ఉన్ నబీ రెడ్‌ఫోర్ట్ వద్ద పేలుడుకు పాల్పడ్డాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+