మరో రైలు ప్రమాదం.. ఉదయం శక్తి కుంజ్.. మధ్యాహ్నం రాజధాని ఎక్స్ ప్రెస్!
హౌరా నుంచి జబల్ పూర్ వెళ్లే శక్తి కుంజ్ ఎక్స్ ప్రెస్ సోన్ బాంద్రా వద్ద గురువారం ఉదయం ప్రమాదానికి గురైన కొద్దిగంటల్లోనే ఢిల్లీ-రాంచీ రాజధాని ఎక్స్ ప్రెస్ కూడా పట్టాలు తప్పింది.
లక్నో: కేంద్ర రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ కు రెండు రైలు ప్రమాదాలు స్వాగతం పలికాయి. మాజీ రైల్వే మంత్రి సురేష్ ప్రభు నుంచి కొత్త మంత్రి పియూష్ గోయల్ పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే యూపీలో జరుగుతున్న రైలు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
ఉత్తరప్రదేశ్ లో గత నెల రోజులుగా రైలు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. గురువారం ఉదయం హౌరా నుంచి జబల్ పూర్ వెళ్లే శక్తి కుంజ్ ఎక్స్ ప్రెస్ సోన్ బాంద్రా వద్ద ప్రమాదానికి గురైంది. రైలుకు చెందిన ఏడు బోగీలు పట్టాలు తప్పాయి.

ఈ ప్రమాదం జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే మరో రైలు పట్టాలు తప్పడం కలకలం రేపుతోంది. ఢిల్లీ-రాంచీ రాజధాని ఎక్స్ ప్రెస్ రైలు ఢిల్లీలోని మింటో బ్రిడ్జి సమీపంలో పట్టాలు తప్పింది. రైలు ఇంజిన్, ఒక బోగీ పట్టాల నుంచి పక్కకి వెళ్లిపోయాయి.
అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ఉత్తర రైల్వే విభాగ అధికార ప్రతినిధి ప్రకటించారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకున్న సిబ్బంది వెంటనే మరమ్మతు పనులు ప్రారంభించారు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications