సభల్లో కాంగ్రెస్ ఆందోళన: బాధగా ఉందన్న మోడీ
న్యూఢిల్లీ: లోకసభ, రాజ్యసభల్లో కాంగ్రెస్ తోపాటు విపక్షాల ఆందోళనలు గురువారం కూడా కొనసాగుతూనే ఉన్నాయి. గురువారం ఉదయం పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి విపక్షాల నిరసనకు దిగాయి. దీంతో మొదట రాజ్యసభ, తర్వాత లోకసభలు వాయిదా పడ్డాయి.
సభలో విపక్షాల తీరుతో నొచ్చుకున్న ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. పార్లమెంటు జరుగుతున్న తీరు బాధాకరంగా ఉందని అన్నారు. జిఎస్‌టితోపాటు అనేక బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. సమావేశాలు సజావుగా సాగేందుకు కాంగ్రెస్ తోపాటు విపక్షాలు సహకరించాలని కోరారు.
కాగా, వాయిదాకు ముందు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ భారతీయ జనతా పార్టీ ఎంపి వీరేందర్ సింగ్‌పై కాంగ్రెస్ సభ్యులు మండిపడ్డారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు.

వీరేందర్ సింగ్ వెంటనే క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ సీనియర్ సభ్యులు మల్లిఖార్జున ఖర్గే డిమాండ్ చేశారు. స్పీకర్ పోడియంను చుట్టుముట్టిన కాంగ్రెస్ సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎంపి వీరేందర్ సింగ్ వ్యాఖ్యలపై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానానికి పట్టుబట్టారు.
సభ సజావుగా సాగేందుకు విపక్ష సభ్యులు సహకరించాలని లోకసభ స్పీకర్ సుమితా మహాజన్ కోరారు. అయినప్పటికీ ఆందోళన కొనసాగించడంతో సభను వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications