అమ్మతోడు, ఆ ఐదు శాఖలు మాకే కావాలి, మిగిలింది ఏంది బొక్కా అంటూ సిద్దూ వర్గం ?

బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటకలో 135 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకుని అధికారంలోకి వచ్చామని పైకి ఆనందంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కు లోపలమాత్రం చుక్కలు కనపడుతున్నాయి. కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య పేరు ప్రకటించడానికి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కు తల ప్రాణం తోకకు వచ్చినట్లు అయ్యింది.

ఇదే సమయంలో సీఎం సీటు సిద్దరామయ్యకు త్యాగం చేసిన కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఉప ముఖ్యమంత్రి పదవికి పరిమితం అయ్యారు. కర్ణాటకలో తానే మాత్రమే ఉప ముఖ్యమంత్రిగా ఉండాలని, ఇద్దరు, ముగ్గురు ముఖ్యమంత్రులను నియమించడానికి తాను అంగీకరించనని ఆరోజే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ముందు డీకే శివకుమార్ కుండలు బద్దలు కొట్టి చెప్పారు.

 karnatakacabinetexpansion

గతంలో ఉప ముఖ్యమంత్రులుగా పని చేసిన నాయకులు ఇప్పుడు మంత్రులుగానే పని చెయ్యాల్సి వచ్చింది. సిద్దరామయ్యకు సీఎం సీటు ఇచ్చిన డీకే శివకుమార్ కీలకమైన మంత్రి పదవులు తమకే కావాలని ఇప్నుడు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ముందు తేల్చిచెప్పారు. కీలకమైన శాఖల కోసం సీఎం సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మధ్య మళ్లీ వార్ మొదలైయ్యింది.

 karnatakacabinetexpansion

మా వాళ్లకు కీలకమైన శాఖలు కేటాయించాలని సిద్దరామయ్య అంటున్నారని, లేదు మా వాళ్లకు కీలక శాఖలు ఇవ్వాలని డీకే. శివకుమార్ పట్టుబడుతున్నారని తెలిసింది. సిద్దరామయ్య, డీకే శివకుమార్ కు సర్దిచెప్పలేక కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తలలు పట్టుకుంటున్నదని, ఇది ఎక్కడిపోయి ఎక్కడికి వస్తుందో అంటూ కాంగ్రెస్ పార్టీ హడలిపోతున్నదని తెలిసింది.

ఐదు కీలక శాఖల తనకు కానేకావలని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ముందు డీకే శివకుమార్ పట్టుపడ్డారని, అందుకే అలిగి ఆయన బెంగళూరు వచ్చేశారని తెలిసింది. బెంగళూరు నగరాభివృద్ది శాఖ, భారీ నీటిపారుదల శాఖ, విద్యుత్ శాఖ, హోమ్ శాఖ, గ్రామీణాభివృద్ది శాఖ, పంచాయితీ రాజ్ శాఖ మాకు కానేకావాలని డీకే శివకుమార్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ముందు తేల్చి చెప్పారని తెలిసింది.

 karnatakacabinetexpansion2

తనకు ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు బెంగళూరు నగరాభివృద్ది శాఖ, భారీ నీటిపారుదల శాఖలు కావాలని, తన అనుచరులకు విద్యుత్ శాఖ, హోమ్ శాఖ, గ్రామీణాభివృద్ది శాఖ, పంచాయితీ రాజ్ శాఖలు కావాలని డీకే శివకుమార్ డిమాండ్ చేస్తున్నారని తెలిసింది. డీకే శివకుమార్ డిమాండ్ చేస్తున్న శాఖల్లో మూడు శాఖలు తనకే కావలని సిద్దరామయ్య కూడా పట్టుబడుతున్నారని, ఇద్దరికి నచ్చచెప్పలేక కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అయోమయంలో పడిపోయిందని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నాయకుడు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+