పాక్ తో చర్చల వేళ తేల్చేసిన భారత్ - అమెరికా "ఫిక్స్", అనూహ్య మలుపు..!!
భారత్ - పాక్ ఉద్రిక్తతల వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాల్పుల విరమణ ప్రకటన తరువాత తొలి సారి రెండు దేశాల మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్స్ సమావేశం జరగనుంది. ఆపరేషన్ సింధూర్ .. ఆ తరువాత చోటు చేసుకున్న పరిణామాలతో అమెరికా జోక్యం చేసుకుంది. కాల్పుల విరమణకు ఒప్పించింది. దీంతో, రెండు దేశాల మధ్య జరిగే ఈ చర్చల్లో భారత్ తమ వైఖరి పైన ఇప్పటికే స్పష్టత ఇచ్చింది. షరతులు - డిమాండ్లు విధించింది. దీంతో, పాక్ నుంచి వచ్చే స్పందనకు అనుగుణంగా నిర్ణయాలు ఉంటాయని భారత్ తేల్చి చెప్పింది.
చర్చల వేళ
భారత్ - పాక్ మధ్య ఉద్రిక్తత కొనసాగుతోంది. ఈ రోజు రెండు దేశాల మిలిటరీ ఆపరేషన్స్ డీజీ ల మధ్య హాట్ లైన్ లో చర్చలు జరుగుతున్నాయి. 48 గంటల పాటు కాల్పుల విరమణ, కొనసాగిం , ఉద్రిక్త వాతావరణం తగ్గించడం వంటి కీలక అంశాలపై ఇరు దేశాలు చర్చించనున్నాయి. కాగా, ఈ చర్చల సమయంలో భారత్ తమ డిమాండ్స్ ఏంటనేది తేల్చి చెప్పింది. కాల్పుల విరమణ కోసం భారత్ ప్రధానితో అమెరికా వైస్ ప్రెసిడెంట్ వాన్స్ మాట్లాడిన సమయంలోనే కొన్ని అంశాల పైన స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది. అందులో ప్రధానంగా పాక్ లో ఉన్న మసూద్ అజార్ తో పాటుగా టాప్ ఉగ్రవాదులను అప్పగించాలనేది ప్రధాన డిమాండ్ గా ఉంది. అదే సమయంలో పీఓకే ను పాక్ ఖాళీ చేయాల్సిందేనని మోదీ తేల్చి చెప్పినట్లు సమాచారం.

పాక్ మళ్లీ రెచ్చగొడితే
కాల్పుల విరమణ నిర్ణయం తరువాత భారత్ సరిహద్దు ప్రాంతాల్లో రెచ్చగొట్టే చర్యలకు దిగింది. డ్రోన్లతో దాడులకు ప్రయత్నించింది. భారత సైన్యం వాటిని ధీటుగా తిప్పి కొట్టింది. ఇక, ఎలాంటి షరతులు లేకుండా చర్చలు జరగాలని ఒప్పందంలో భారతదేశం స్పష్టంగా చెప్పింది. కాల్పుల విరమణ ప్రాధాన్యతగా అంగీకారాన్ని పాకిస్తాన్ తెలిపింది. ముందస్తు, తదుపరి షరతులు లేకుం నే చర్చలు జరగాలని భారత్ స్పష్టం చేసింది. కాల్పుల విరమణ వేళ జరుగుతున్న ఈ చర్చల్లో భారత్ తమ వైఖరి స్పష్టం చేసేందుకు సిద్దం అవుతోంది. ఉగ్రవాదుల విషయంలో భారత్ కఠినం ఉంటామనే సంకేతాలు ఇవ్వనుంది. ఇదే సమయంలో పాక్ లో ఆశ్రయం పొందిన ఉగ్రవాదులను అప్పగించే అంశం పైన భవిష్యత్ లోనూ పట్టుబట్టాలని భావిస్తోంది.
తేల్చేసిన ప్రధాని
ప్రధాని వద్ద జరిగిన సమావేశంలో పాకిస్థాన్‌పై ఎలాంటి షరతులు విధించాలి, ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలి, ఒక వేళ మన షరతు లకు పాకిస్థాన్ ఒప్పుకోకుంటే ఎలాంటి నిర్ణయాలు వెల్లడించాలనే అంశం పైన నిర్ణయానికి వచ్చి నట్లు సమాచారం. పాక్ పైన దౌత్య పరంగా..సైనిక చర్యల ద్వారా భారత్ పెంచిన ఒత్తిడిని కొనసాగించి..పై చేయి సాధించేలా భారత్ వ్యూహాలు అమలు చేస్తోంది. ఇదే సమయంలో పాక్ విషయంలో ఎలాంటి మధ్య వర్తిత్వం అవసరం లేదని అమెరికా ప్రతిపాదన పైన మోదీ తన వైఖరి తేల్చి చెప్పారు. ఇటు ఆపరేషన్ సింధూర్ ముగియలేదనే ప్రకటనల మధ్య.. ఈ చర్చల పైన ఉత్కంఠ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications