చైనా భూభాగంలోకి డ్రోన్ ప్రవేశం, కానీ.. : ఇండియా

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: తమ భూభాగంలోకి ప్రవేశించిన ఇండియా డ్రోన్‌ ప్రవేశించిన విషయంపై చైనాకు సమాచారమిచ్చామని ఇండియా రక్షణ శాఖ ప్రకటించింది. సాంకేతిక కారణాల వల్లే ఇలా జరిగిందని ఇండియాకు చెందిన రక్షణ శాఖ స్పష్టం చేసింది.

షాక్: ఇండియా డ్రోన్ కూల్చివేసిన చైనా, కారణమిదే

చైనా గగనతలంలోకి భారత డ్రోన్‌ వెళ్లిందని వస్తున్న వార్తలపై రక్షణశాఖ స్పందించింది. ఆ వార్త నిజమేనని, సాంకేతిక కారణాల వల్లే అలా జరిగిందని పేర్కొంది. సాధారణ శిక్షణలో ఉన్న భారత్‌కు చెందిన మానవరహిత వైమానిక వాహనం(యూఏవీ) ఒకటి ఇటీవల సాంకేతిక కారణాల వల్ల గ్రౌండ్‌ కంట్రోల్‌ విభాగంతో సంబంధాలు కోల్పోయిందని ఇండియన్ డిఫెన్స్ శాఖ ప్రకటించింది.

Did Indian drone enter Chinese airspace? Yes, but we told China, says India

సిక్కిం సెక్టార్‌ వద్ద వాస్తవాధీన రేఖను దాటిందని రక్షణశాఖ వెల్లడించింది..అయితే భారత సరిహద్దు భద్రతా సిబ్బంది దీనిపై వెంటనే చైనా దళాలకు సమాచారమిచ్చాయి.

యూఏవీ ఎక్కడుందో గుర్తించాలని కోరాయి. చైనా అధికారులు కూడా స్పందించి వివరాలను పంపారు. ఘటనకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నాం. ప్రొటోకాల్‌ను దృష్టిలో పెట్టుకుని విచారిస్తున్నామని అని రక్షణశాఖ తెలిపింది. అయితే ఆ వాహనం కూలిపోయిందా లేదా అన్నదానిపై మాత్రం రక్షణశాఖ స్పష్టత ఇవ్వలేదు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
An Indian unmanned aerial vehicle (UAV) did cross the Line of Actual Control (LAC) and entered Chinese airspace in the Sikkim sector, the Ministry of Defence (MoD) said, confirming a Chinese military claim made earlier today.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి