స్వామీజీ నో: యాంకర్ అమృతను డిగ్గీ పెళ్లాడుతారా?
న్యూఢిల్లీ: ప్రముఖ టీవీ యాంకర్ అమృతా రాయ్‌తో తన సంబంధాన్ని బయట పెట్టి సంచలనం సృష్టించిన కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఆమెను పెళ్లి చేసుకోవడం లేదని సమాచారం. పలు వెబ్‌సైట్లు, పలు స్థానిక పత్రికల సమాచారం మేరకు ఆయన ఇటీవల ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురు శంకరాచార్య స్వామి శ్రీ స్వరూపానంద సరస్వతీజీ కలిశారట.
అమృతా రాయ్‌తో పెళ్లి విషయమై ఆయన స్వామీజీ ఆశీస్సులు కోరారని సమాచారం. అయితే, ఆ స్వామీజీ మాత్రం దిగ్విజయ్ సింగ్ రెండో పెళ్లికి ఆశీర్వాదం ఇచ్చేందుకు నిరాకరించారట.

దిగ్విజయ్ సింగ్ స్వామీజీతో పరమహంసీ గంగాశ్రమంలో దాదాపు ఇరవై నిమిషాలు మాట్లాడినట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన విషయమైతేనే తన ఆశీర్వాదాలు ఉంటాయని, ప్రజాప్రయోజనాలకు విరుద్ధంగా ఉండే వాటికి తన ఆశీర్వాదాలు ఉండవని ఆ స్వామీజీ డిగ్గీతో సూటిగా చెప్పారట. మొత్తానికి స్వామీజీ ఆశీర్వాదం లేకుండానే డిగ్గీ వెనుదిరిగారట.
టీవీ యాంకర్ అమృతా రాయ్‌ను తాను పెళ్లి చేసుకుంటానని చెప్పిన డిగ్గీ ఇప్పుడు ఏం చేయనున్నారనేది ఆసక్తికరం! తాను చెప్పినట్లుగా అమృతా రాయ్‌తో పెళ్లి పీటలు ఎక్కుతారా లేక సహజీవనం చేస్తారా అనేది చూడాలి. అమృతా రాయ్‌ను తాను పెళ్లి చేసుకుంటానని గత నెల 30 దిగ్విజయ్ బాంబు పేల్చారు. అమృతా రాయ్ కూడా డిగ్గీని వివాహం చేసుకుంటానని చెప్పారు. ఇప్పుడు స్వామీజీ వారి పెళ్లికి ఆశీర్వాదం పలికేందుకు నిరాకరించారు.












Click it and Unblock the Notifications