పర్సనల్ లైఫ్‌లోకి: యాంకర్ ఇష్యుపై డిగ్గీ, ఎగ్జిట్ పోల్స్‌పై

న్యూఢిల్లీ: ప్రముఖ టీవీ యాంకర్ అమృతా రాయ్‌తో పెళ్లి విషయమై ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురు శంకరాచార్య స్వామి శ్రీ స్వరూపానంద సరస్వతీజీని తాను కలిశానన్న ప్రచారం పైన కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అమృతా రాయ్‍తో రెండో పెళ్లి నిమిత్తం స్వామీజీ ఆశీస్సుల కోసం డిగ్గీ వెళ్లారని అయితే, ప్రజాప్రయోజనాలకు సంబంధించిన విషయమైతేనే తన ఆశీర్వాదాలు ఉంటాయని, ప్రజాప్రయోజనాలకు విరుద్ధంగా ఉండే వాటికి తన ఆశీర్వాదాలు ఉండవని ఆ స్వామీజీ డిగ్గీతో సూటిగా చెప్పారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై డిగ్గీ మండిపడుతున్నారు.

Digvijay Singh's guru refuses to give blessings for

సోషల్ మీడియా పైన ఆయన దుమ్మెత్తి పోశారు. సోషల్ మీడియా ఇప్పుడు యాంటీ సోషల్ మీడియాగా మారిందని, తనను సోషల్ మీడియా లక్ష్యంగా చేసుకుందని, తన వ్యక్తిగత జీవితాన్ని లక్ష్యంగా చేసుకుందని ఆయన ఆవేదన, ఆక్రోశం వ్యక్తం చేశారు.

డిగ్గీ కలయిక పైన స్వామీజీని కూడా మీడియా అడిగినట్లుగా తెలుస్తోంది. అయితే దిగ్విజయ్ తనను మరో విషయం పైన కలిశారని, పెళ్లి విషయమై అడిగేందుకు కలవలేదని స్వామీజీ చెప్పినట్లుగా తెలుస్తోంది.

ఎగ్జిట్ పోల్స్ పైన డిగ్గీ

దిగ్విజయ్ సింగ్ ఎగ్జిట్ పోల్ ఫలితాలను కూడా తప్పు పట్టారు. దేశంలో ఎనభై కోట్ల మంది ఓటర్లు ఉంటే కేవలం లక్షల మంది నుండి అభిప్రాయం సేకరించి.. ఈ ఫలితాలు రానున్నాయని ఎలా చెబుతారని ప్రశ్నించారు. 16వ తేదీ వరకు నిరీక్షించాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+