దళిత సిఎం: జైరాంకు డిగ్గీ షాక్, కిరణ్ తీరుతో బాధపడ్డా
న్యూఢిల్లీ: కేంద్రమంత్రి జైరామ్ రమేష్‌కు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ మంగళవారం షాకిచ్చారు. ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ... దళిత ముఖ్యమంత్రి అంశంపై స్పందించారు. కాంగ్రెసు పార్టీ అధికారంలోకి వస్తే దళిత ముఖ్యమంత్రిని చేస్తామని జైరామ్ నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై దిగ్విజయ్ మాట్లాడుతూ... దళిత ముఖ్యమంత్రి అనేది జైరామ్ రమేష్ వ్యక్తిగత అభిప్రాయమని చెప్పారు.
ఇవాళ రెండు ప్రాంతాల పిసిసిలను ప్రకటిస్తామని చెప్పారు. 13, 14, 15 తేదీలలో తాను హైదరాబాదులో ఉంటానని చెప్పారు. హోలీ తర్వాత హైదరాబాదులో భారీ సభ ఉంటుందని, ఆ సభలో ఏఐసిసి అద్యక్షురాలు సోనియా గాంధీ పాల్గొంటారని చెప్పారు. ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులపై తాము కసరత్తు చేస్తున్నామని చెప్పారు. హోలీ తర్వాత సభ ఉంటుందన్నారు.

పొత్తులపై కమిటీ చర్చించి ఆంటోనీ కమిటీకి నివేదిక ఇస్తుందన్నారు. ఆ కమిటీయే తుది నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. కాంగ్రెసు పార్టీ నుండి ఇతర పార్టీలలోకి వెళ్లేందుకు ఎవరికైనా స్వేచ్ఛ ఉందన్నారు. అయితే, ఇతర పార్టీలలోకి వెళ్లే వారికి కమిట్ మెంట్ లేదన్నారు. మేనిఫెస్టో, ప్రచారం కమిటీలపై కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు. సీమాంధ్రలో కాంగ్రెసు నుండి ఇతర పార్టీలలోకి వెళ్తుంటే, తెలంగాణలో కాంగ్రెసులోకి వస్తున్నారన్నారు.
కిరణ్ తీరు ఆవేదనకు గురి చేసింది
మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తీరు తనను ఆవేదనకు గురి చేసిందని దిగ్విజయ్ సింగ్ చెప్పారు. పార్టీ పెట్టనని హామీ ఇచ్చి ఆయన జై సమైక్యాంధ్రను ప్రకటించారన్నారు. కాంగ్రెసులోనే కొనసాగుతానని చివరి వరకు చెప్పారని, ఇప్పుడు ఇలా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఢిల్లీకి బొత్స
అధిష్టానం పిలుపుతో ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ మంగళవారం ఉధయం ఢిల్లీకి బయలుదేరారు.












Click it and Unblock the Notifications